Home రాజకీయాలు జనసేనతో పొత్తా.. వైసీపీ వర్గాలు ఏమంటున్నాయ్?

జనసేనతో పొత్తా.. వైసీపీ వర్గాలు ఏమంటున్నాయ్?

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు పొత్తు పెట్టుకోవచ్చని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పొత్తుల వ్యవహారంలో అధినాయకత్వ స్థాయిలో కాదు కానీ.. అంతకన్నా కింది స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి పొత్తు విషయంలో జగన్ అంత సానుకూలంగా లేడని.. సోలోగానే సత్తా చాటాని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడని అంటున్నారు.

ఇక పొత్తు పట్ల వైసీపీలోని కాపు నేతలు, పవన్ మీద ఎంతో కొంత అభిమానం ఉన్న వాళ్లు భావిస్తున్నారని సమాచారం. ఎక్కువ సీట్లు కాదు.. కనీసం ఇరవై సీట్ల లెవల్లో పొత్తును సెట్ చేద్దామని ఈ నేతలు అంటున్నారట. జగన్ పవన్ వేర్వేరుగా పోటీ చేసినా.. వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది, ఒకవేళ జనసేనతో పొత్తు కూడా పెట్టుకుని పోతే ఇక తిరుగే ఉండదు.. చంద్రబాబును చిత్తు చేయవచ్చు అనేది ఈ నేతల లెక్క.

అయితే ఈ ప్రతిపాదన పట్ల జగన్ ఇంకా స్పందించనే లేదని తెలుస్తోంది. ఆ సంగతలా ఉంటే.. ఈ విషయం గురించి వైసీపీ నేతలు ఆసక్తిదాయకమైన రీతిలో స్పందిస్తున్నారు. తమ పార్టీ పొత్తుల పట్ల ఏ మాత్రం ఆసక్తితో లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని పోటీ చేయాలనే ఆలోచనే తమకు లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. పొత్తు ఊహాగానాలే కొట్టేస్తున్నాయి.