Home రాజకీయాలు టీడీపీ సభ్యత్వ నమోదు.. అడ్డదారిలో ఇలా!

టీడీపీ సభ్యత్వ నమోదు.. అడ్డదారిలో ఇలా!

SHARE

ఏకంగా కోటి మంది చేత పార్టీ సభ్యత్వాలు తీసుకునేలా చేయాలని ఆదేశాలు జారీ చేశాడు చంద్రబాబు నాయుడు. తన పార్టీ వాళ్లకు ఈ మేరకు కీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇంకే ముంది తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమదైన శైలిలో వారు రెచ్చిపోతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డదారిలో తీసుకెళ్తున్నారు.

సరిగ్గా నెలాఖరులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఇంతలోనే నవంబర్ వచ్చేసింది. ఈ తొలి వారంలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఇంకేముంది అలాంటి పంపిణీ జరిగే చోటున టీడీపీ నేతలు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. పెన్షనర్లు తీసుకునే డబ్బు నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అంటూ వసూళ్లు చేస్తున్నారు.

పెన్షన్లు తీసుకునేది బీదాబిక్కి జనాలు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వం ఇచ్చే స్వల్పమైన పెన్షన్ కోసం నెలంతా ఎదురుచూస్తూ ఉంటారు. వారు ఇప్పుడు పెన్షన్ తీసుకునేందుకు రాగానే తమ్ముళ్లు రంగంలోకి దిగుతున్నారు. వారి నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుని టీడీపీ సభ్యత్వాన్ని ఇస్తున్నారు.

ఈ విధంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు తమ్ముళ్లు, రాష్ట్రంలో పెన్షనర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. వారందరికీ ప్రభుత్వం ఇచ్చే సొమ్మును టీడీపీ సభ్యత్వం కోసం అంటూ కట్ చేయిస్తున్నారు. ఎలాగూ ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం టీడీపీ నేతల చేతుల మీదే సాగుతూ ఉంటుంది.

పచ్చ చొక్కాల వాళ్లే పెన్షన్లను ఇచ్చే బాద్యతల్లో ఉన్నారు. దీంతో టీడీపీ సభ్యత్వానికి అంటూ కటింగ్స్ వేయడానికి వాళ్లకు అవకాశం ఏర్పడింది. అలా చెలరేగిపోతున్నారు.