Home రాజకీయాలు బాబు ఆత్మ గౌరవం పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

బాబు ఆత్మ గౌరవం పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

SHARE

కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు పొత్తు మొదటికే మోసం అయ్యేలా వుంది బాబు కి. అసలు ఆలా ఎలా పొత్తు పెట్టుకున్నారు పొద్దున్న లేస్తే చాలు ఆత్మగౌరవం అంటూ ఆయన ప్రసంగాలు….అదే అత్మగౌరవం తో ప్రసంగాలు ముగిస్తూ ఉండే ముఖ్యమంత్రి గారి ఆత్మగౌరవం ఇప్పుడెక్కడికి పోయిందంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. అసలు తెలుగుజాతి ఆత్మగౌరవాన్నిమొత్తాన్ని తాకట్టు పెట్టారు అంటూ భగ్గుమన్నారు జనసేన అధినేత.

ఆత్మగౌరవం అంటే ఏంటో చంద్రబాబు కి తెలుసా అని మీడియా పవన్ ప్రశ్నించారు. “కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అని పిలుపునిచ్చి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలలో రాకుండా చేసా౦

నా కుటుంబాన్ని అంత దూరంగా పెట్టి టీడీపీ కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చేలా చేస్తే ఇప్పుడు బాబు అదే కాంగ్రెస్ తో కాపురానికి సిద్దం అయ్యారు, ఢిల్లీ వెళ్లి మరి కాంగ్రెస్ పెద్దలతో ఫోటోలకు పోజులిచ్చారు, ఇదేనా ఆత్మగౌరవం అని పవన్ మండిపడ్డారు.

ఎవరైనా తనకు భయం లేదని అనే బాబుకి ఎవరో ఒకరి అండ లేకపోతే భయమని పవన్ విమర్శించారు . ఇంకా మేం బీజేపీ ని వెనకేసుకోస్తున్నాం అని…తన సొంత అన్నయ్యనే కాదనుకున్నప్పుడు ఇంకా ఎవరికీ తాను భయపడతానని పవన్ అన్నారు.

తానూ ఎప్పుడు కూడా బీజేపీ తో గాని టీడీపీ తో గాని చేతులు కలపనని జనసేనని విలీనం చెయ్యను గాక చేయను అని తెలిపారు. ఓటమి వచ్చినా కానీ తెలుగుదేశం లాగా నేను నా జాతి ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టను అని పవన్ పేర్కొన్నారు.