Home ప్రత్యేకం హాట్ న్యూస్..తీవ్ర ఆందోళనలో టీడీపీ శ్రేణులు!

హాట్ న్యూస్..తీవ్ర ఆందోళనలో టీడీపీ శ్రేణులు!

SHARE

జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం..మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు దోస్తీ.. ఈ రెండు పరిణామాల్లో కార్నర్ అవుతోంది తెలుగుదేశం పార్టీ.

ముందుగా జగన్ పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం మొదట ఎదురుదాడి చేసింది. ఆ అటాక్ పై తెలుగుదేశం పార్టీ స్పందన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. మొదటేమో అది జగన్ మీద జగనే చేయించుకున్న అటాక్ అని టీడీపీ అంది.ఆ పై అది బీజేపీ చేయించిన అటాక్ అంది. అయితే ఈ విషయంలో నిఖార్సైన విచారణ కు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీనిపై విచారణ చేయించే ఉద్దేశం కూడా లేదు.

చివరకు చంద్రబాబే చెప్పాడు అది జగన్ మీద జగన్ చేయించుకున్న అటాక్ కాదు అని. మరి అసలు కథ ఏమిటి? అంటే మాత్రం ఇప్పటి వరకూ దాన్ని బయటకు తీయడం లేదు. మరోవైపు ఈవ్యవహారంలో వైసీపీ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై గనుక హై కోర్టు విచారణకు ఆదేశిస్తే.. అంతే సంగతులు. అప్పుడు టీడీపీ పాత్ర పూర్తిగా బయటకువచ్చే అవకాశం ఉంది.

ఇక కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని టీడీపీ ఏదో విధంగా సమర్థించుకుంటోందికానీ.. ఈ విషయంలో విమర్శలు వాడీ వేడీగానే ఉన్నాయి. టీడీపీని ఇరకాటంలో పెడుతున్నాయి విమర్శలు. ఇలా రెండు రకాలుగా కార్నర్ అవుతోంది టీడీపీ. ఈ పరిణామాలు పార్టీపై జనాల్లో నమ్మకాన్ని చెరిపేసి తమను దెబ్బ కొడతాయేమో అని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.