Home రాజకీయాలు జగన్ పై టీడీపీ వ్యాఖ్యలు.. తప్పు పట్టిన పవన్!

జగన్ పై టీడీపీ వ్యాఖ్యలు.. తప్పు పట్టిన పవన్!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల తీరును తప్పు పట్టాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. జగన్ పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెకిలిగా మాట్లాడటం తగదు అని పవన్ కల్యాణ్ హితవు పలికాడు. ఈ విషయంపై మాట్లాడటంలో తెలుగుదేశం పార్టీ నేతలు నోటిని హద్దులో ఉంచుకోవాలని పవన్ కల్యాణ్ అన్నాడు.

జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం విషయంలో చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులతో వెకిలిగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాబును తప్పు పట్టాడు పీకే.

అలాగే జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం విషయంలో టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పరమ నీఛంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. జగన్ మీద ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు దాడి చేయించారని కారుకూతలు కూశాడు రాజేంద్ర ప్రసాద్.

ఈ వ్యాఖ్యలను కూడా పవన్ కల్యాణ్ ఖండించాడు. ఏ తల్లి అయినా, ఏ చెల్లి అయినా తమ వాడిని హత్య చేయించాలని అనుకుంటారా? అని పవన్ ప్రశ్నించాడు. గతంలో తన తల్లి విషయంలో కూడా తెలుగుదేశం నేతలు ఇలానే మాట్లాడారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇలాంటి తీరును తెలుగుదేశం నేతలు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించాడు. ఇక బాబు ఢిల్లీ పర్యటన ను కూడా పవన్ కల్యాణ్ తప్పు పట్టాడు.