Home రాజకీయాలు టీడీపీ ఖేల్ ఖతం.. అంటున్న లేటెస్ట్ సర్వే!

టీడీపీ ఖేల్ ఖతం.. అంటున్న లేటెస్ట్ సర్వే!

SHARE

ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి హడావుడి చేస్తున్నాడు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేస్తా అంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడు. మొన్నటి వరకూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన అవకాశవాదంలో కొత్త చాప్టర్ లో ఇలా వ్యవహరిస్తూ ఉన్నాడు. బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావాలి, ఎన్డీయే తరఫున మోడీనే మళ్లీ ప్రధాని కావాలి అని చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మళ్లీ మోడీని ప్రధాని కానివ్వను అంటున్నాడు. అయినా బాబుకు అంత సీనుందా? అనేది అందరికీ తెలిసిందే.

ఆ సంగతలా ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజకీయ పరిస్థితి గురించి ఒక సర్వే ఆసక్తిదాయకమైన విషయాలన చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల వస్తే ఏపీలో టీడీపీ చిత్తే అని ఈ అధ్యయనం అంటోంది.

కేవలం ఐదు ఎంపీ సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం అవుతుందని జాతీయ మీడియా సర్వే ఒకటి చెబుతోంది. పాతిక ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ కేవలం ఐదు మాత్రమే గెలవగలదని.. ఇరవై ఎంపీ సీట్లలో విజయం సాధించి వైసీపీ ఏపీలో విజయబావుటా ఎగరేస్తుందని ఈ సర్వే చెబుతోంది.
తెలుగుదేశం పార్టీ ఖేల్ ఖతం అని.. ఈ అధ్యయనం చెబుతోంది.

కొన్ని రోజుల క్రితం ఇదే సర్వే సంస్థ చేసిన అధ్యయనంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడూ అదే మాట చెబుతోంది సదరు సర్వే.