Home రాజకీయాలు రాహుల్ గాంధీ ఒక మొద్దు: చంద్రబాబు

రాహుల్ గాంధీ ఒక మొద్దు: చంద్రబాబు

SHARE

” సోనియా మొద్దు కుమారుడు రాహుల్ కు నాయకత్వ లక్షణాలు లేవు. వ్యవస్థలన్నీ నాశనం చేస్తోంది. పనికిమాలిన, అసమర్థ ప్రధాని మన్మోహన్ కారణంగా దేశం సర్వనాశనమైంది. వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారు. దేశంలో పుష్కలంగా వనరులున్నప్పటికీ దివాళా తీసింది. సోనియా కక్కుర్తి రాజకీయంతో రాష్ట్రాన్ని బలిచేస్తున్నారు. దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ పార్టీని భూస్థాపితం చేయాలి. జాతి కోసం, దేశం కోసం ఎన్టీయేతో పొత్తు పెట్టుకున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సమగ్రతాభివృద్ధి సాధ్యమవుతుంది. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపగలరు”.

ఇదీ గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయడు చెప్పిన మాట. ఇది మాత్రమే కాదు.. సోనియా, రాహుల్, కాంగ్రెస్ లను చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా తిట్టాడో అందరికీ తెలిసిందే. సోనియాగాంధీని ఇటాలియన్ అంటూ చంద్రబాబు చెలరేగిపోయాడు.

ఇక ఆరేడు నెలల కిందట కూడా చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం మాట్లాడాడు. రాహుల్ గాంధీ ఏపీకి వచ్చాడంటే.. ఎందుకొచ్చాడు.. అంటూ బాబు విరుచుకుపడ్డాడు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బాబు విరుచుకుపడ్డాడు.

అయితే ఇలా మాట్లాడిన బాబు ఇప్పుడు రాహుల్ కు శాలువా వేసి సన్మానించాడు. రాహుల్ ను కలవడంతో తన జన్మధన్యం అయిపోయిందన్నట్టుగా మాట్లాడాడు. ఇదీ బాబు మార్కు అవకాశవాదం.