Home రాజకీయాలు బాబు మరో ఢిల్లీ టూర్.. అసలు విషయం ఇదే!

బాబు మరో ఢిల్లీ టూర్.. అసలు విషయం ఇదే!

SHARE

వరస పెట్టి ఢిల్లీ టూర్లు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటన. జగన్ మీద అటాక్ జరగగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లాడు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ కోసమే చంద్రబాబు నాయుడు ఢిల్లీ కి వెళ్లాడనేది తెలిసిన విషయమే. అంటే.. ప్రజల సొమ్ము కదా.. బాబుది పోయేదేమంది?

అందుకే ఇప్పుడు మరో టూర్ అనమాట. ఈ సారి బాబు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి ఢిల్లీ పర్యటన అట. కేంద్రంలోని పార్టీలు బాబు చొరవ పట్ల ఉత్సాహంతో ఉన్నాయట. ఇదీ పచ్చ మీడియా మాట.

అయితే మొన్నటి వరకూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు డిల్లీలో కొత్త వేషం కడితే అక్కడి వాళ్లంతా నమ్మేస్తారా? అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే బాబు మాత్రం ఢిల్లీ టూర్ తో ఏదో ప్రచారం పొందుదామని ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా బీజేపీ మీద కారాలూ మిరాయాలూ నూరుతూ చంద్రబాబు ఏదో ప్రయోజనం పొందుదామని చూస్తున్నాడు.

ఇక ఇప్పుడు బాబు వరసగా ఢిల్లీ టూర్లు వేయడానికి మరో కారణం జగన్ మీద జరిగిన హత్యాయత్నం. ఈ అంశం మీద విచారణ జరగాల్సి ఉంది. అయితే బాబు మాత్రం అవసరం లేదని అంటున్నాడు. అలాగే ఈ వ్యవహారాన్ని తెరమరుగు చేసేందుకు కూడా బాబు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వరస పెట్టి ఢిల్లీ పర్యటనలు పెట్టుకుంటన్నాడు.బాబుకు ఇలాంటి రాజకీయాల అలవాటే కదా!