Home రాజకీయాలు అక్కసు..అసహనంతో.. రగులుతున్న టీడీపీ!!

అక్కసు..అసహనంతో.. రగులుతున్న టీడీపీ!!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ అసహనంతో, అక్కసుతో రగిలిపోతోంది. ఈ హత్యాయత్నం విషయంలో తెలుగుదేశంపార్టీ తీరు తీవ్ర వివాదాస్పదంగా ఉంది. ఈ విషయంలో టీడీపీ మొదటి నుంచి ఎలా స్పందిస్తోందో వివరించనక్కర్లేదు. టీడీపీ చాలా దారుణంగా స్పందిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలపాలవుతోంది కూడా. జగన్ మీద హత్యాయత్నం జరిగితే.. దాన్ని ఖండించిన నేతల మీద కూడా చంద్రబాబు విమర్శలు చేశాడు. వాళ్లంతా కుట్ర పన్నుతున్నారని బాబు రెచ్చిపోయాడు. దీనికి గానూ ఛీకొట్టించుకున్నాడు చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి నీఛ రాజకీయాలు బాబుకు అలవాటే కాబట్టి ఆయన కామ్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ బాద్యతాయుతంగా వ్యవహరించడం లేదు. తెలుగుదేశం నేతలు తమకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతూనే ఉన్నారు. జగన్ ను అరెస్టు చేస్తాం అనేంత వరకూ వచ్చారు పచ్చ పార్టీ నేతలు. ఈ మాటలు చాలు.. వీరి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి. టీడీపీ సీనియర్ నేత రాజేంద్రప్రసాద్ జగన్ పై హత్యాయత్నం విషయంలో పరమ లోఫర్ లా మాట్లాడాడు. ఇప్పుడు దాడికి గురి అయిన జగన్ నే అరెస్టు చేస్తామంటూ టీడీపీ నేతలు మాట్లాడారు. దీన్ని బట్టి వారి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా చూస్తుంటే టీడీపీ పరిస్థితిని చాలా అసహనంతో ఉందని స్పష్టం అవుతోంది. జగన్ పై తమ హత్యా కుట్ర ఫెయిల్యూర్ కావడంతో వీర ఇలా మాట్లాడుతున్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయిప్పుడు.