Home రాజకీయాలు ‘కోడి కత్తి’ అంటూ మళ్ళీ ….చంద్రబాబు నవ్వులు!

‘కోడి కత్తి’ అంటూ మళ్ళీ ….చంద్రబాబు నవ్వులు!

SHARE

వైసీపీ అధినేత జగన్ పై దాడి ఘటనకు సంబంధించి వైకాపా నేతలకు ఏం చేయాలో పాలుపోవట్లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయుడు అన్నారు.

ఈ రోజు అమరావతి లో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘కోడి కత్తి’ విషయంలో ఏం చేయాలో, ఎలా సమర్థించుకోవాలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు అర్థం కావడం లేదంటూ నవ్వులు చిందించారు.

దాడి ఘటనపై కేంద్రంతో ఎంక్వైరీ చేయించి, ఏవో మాయమాటలు చెప్పి మనపై బురదజల్లే కార్యక్రమం చేయాలని అనుకున్నారని మండిపడ్డారు. జగన్ కావాలనే తనపై ఈ దాడి చేయించుకున్నాడని తాను చెప్పట్లేదని, అయితే దాడి ఘటనలో నూటికి వెయ్యి శాతం తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నానని అన్నారు.

స్పష్టం చేయటం కాదు ముఖ్యమంత్రి గారూ …ఎంక్వయిరీ కావాలంటున్నారు…తమపై ఎంక్వయిరీ…వేయించుకొగలరా?