Home రాజకీయాలు జగన్ పై అటాక్.. ఆ వ్యూహంతో టీడీపీ!

జగన్ పై అటాక్.. ఆ వ్యూహంతో టీడీపీ!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం విషయంలో ఇప్పటి వరకూ చాలా వేషాలు వేసింది తెలుగుదేశం పార్టీ. ముందుగా ఈ అంశం చాలా చిన్నది అంటూ పాట మొదలుపెట్టారు. అది కూడా జగన్ అభిమానే చేశాడని అన్నారు. ఆ పై జగన్ సొంతంగా ఈ దాడి చేయించుకున్నారని ప్రచారం చేశారు. ఇందులో కేంద్రం కుట్ర అని అన్నారు. ఇప్పుడు కూడా ఇలా ఏదేదో డొల్ల వాదనలతో ఉంది తెలుగుదేశం పార్టీ.

అయితే ఇప్పుడు పరిణామాలు టీడీపీ గేమ్స్ కు అనుకూలంగా లేవు. జగన్ పై జరిగిన అటాక్ వెనుక తీవ్రమైన ఉద్దేశం ఉందని, నిందితుడు జగన్ ను హతమార్చాలని అనుకున్నాడని, అయితే అతడి గురి తప్పి జగన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అని రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడిపోయింది. అంటే దీని వెనుక కుట్ర ఉందని స్పష్టం అవుతోంది.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహాన్ని మొదలుపెట్టింది. ఈ కుట్రను చర్చలో లేకుండా చేసేందుకు తెలుగుదేశం యత్నిస్తూ ఉంది.వాస్తవానికి ఈ కుట్ర వెనుక ఉన్నది తెలుగుదేశం పార్టీ నే అని, అయితే ఆ కుట్ర అడ్డం తిరగడంతో ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, అధికారం చేతిలో పెట్టుకుని ఆడుకుంటోందని పరిశీలకులు అంటున్నారు.

ఇక చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెనుక కూడా జగన్ పై జరిగిన హత్యాయత్నాని డైవర్ట్ చేసే ఉద్దేశమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాము ఇరకాటంలో పడిపోయిన నేపథ్యంలో..ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని బయటపడనీయకుండా ఉండేందుకు టీడీపీ ఈ పాట్లు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.