Home రాజకీయాలు హత్యాయత్నం: జగన్ పెద్ద మనసు, బాబు చిన్నబుద్ధి!

హత్యాయత్నం: జగన్ పెద్ద మనసు, బాబు చిన్నబుద్ధి!

SHARE

మరో మెట్టు పైకి ఎదిగాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇదే ఉదంతంలో మరో అడుగు దిగజారాడు చంద్రబాబు నాయుడు. తన రాజకీయ మనస్తత్వం, అవకాశవాదం తో చంద్రబాబు నాయుడు జగన్ పై హత్యాయత్న ఉదంతంతో మరింత దిగజారిపోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన నిబ్బరంతో, తన గుండె ధైర్యంతో చాలా ధీటుగా వ్యవహరించాడు. ఈ హత్యాయత్న ఉదంతంతో ఈ విషయాలు స్పష్టం అవుతూ ఉన్నాయి.

తనపై అటాక్ జరిగిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి చాలా గుండె నిబ్బరంతో స్పందించాడు. తనకు ఏమీ కాలేదని తమ పార్టీ శ్రేణులకు ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ఎవ్వరూ ఆందోళనకు గురి కావొద్దని పిలుపునిచ్చాడు. తద్వారా తన పై హత్యాయత్నం అనంతరం ఎలాంటి అల్లర్లు జరగకుండా జగన్ చూసుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు.. కనీసం జగన్ ను పరామర్శించలేదు. అదీగాక పరామర్శించిన వాళ్లపై కూడా బురదజల్లాడు. తద్వారా తన మనస్తత్వాన్ని చంద్రబాబు చాటుకున్నాడు.

ఇక జరిగిన ఘటన ద్వారా జగన్ నే ఇరకాటంలో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. ఈ విషయంపై మంత్రులంతా వెకిలిగా స్పందించారు. హేళనగా మాట్లాడారు. అది జగన్ సానుభూతి కోసం చేసిన ప్రయత్నం అని వ్యాఖ్యానించారు. తాము అనుకుంటే జగన్ ను హత్యచేయడం పెద్ద విషయం కాదని పచ్చ పార్టీ నేతలు రౌడీల్లా మాట్లాడారు. ఆ విధంగా తమ స్వభావాన్ని బయటపెట్టుకున్నారు.

ఇక ఇప్పుడు జగన్ ను హతమార్చడానికే ఈ యత్నం జరిగిందని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిపోయింది. విచారణకు ఆదేశించడం లేదు, కుట్ర కోణాన్ని బయటపెట్టడానికి ఇష్టపడటం లేదు. అదే నీఛ రాజకీయం చేస్తోంది. తద్వారా తమ తీరేంటో తెలియజేస్తోంది. హత్యాయత్నం జరిగినా అంతే నిబ్బరంగా కనిపిస్తూ జగన్ నాయకుడిగా తన పెద్ద మనసును చాటుకుంటుంటే, చంద్రబాబు మాత్రం తన చిన్నబుద్ధిని తెలియజేస్తూ ఉన్నాడు.