Home ప్రత్యేకం వైసీపీ ఘాటు కౌంటర్లు.. నోరెత్తని లోకేష్ బాబు!

వైసీపీ ఘాటు కౌంటర్లు.. నోరెత్తని లోకేష్ బాబు!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం విషయంలో లోకేష్ స్పందించిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి సానుభూతి కోసమని ఈ హత్యాయత్నం చేయింకున్నాడని, ఎలాగూ ఓటమి తప్పదని జగన్ ఇలా చేశాడని లోకేష్ ముందుగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి వైసీపీ బలమైన కౌంటర్ ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ బాధ్యతను తీసుకున్నాడు. ట్విటర్ ద్వారానే లోకేష్ కు ఘాటు కౌంటర్లు ఇచ్చారాయన.

‘నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేక, నాన్నారు నామినేట్ చేస్తే MLCగా మంత్రి అయిన నువ్వు గెలుపు-ఓటముల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అధికారంకోసం పొత్తులు,అవసరం తీరాక నిందలు వేయటం మీకు ఏమాత్రం కొత్తకాదు. రాష్ట్రప్రజలను మరోసారి మభ్య పెట్టొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం..’ అంటూ కొడాలని నాని చంద్రబాబు నాయుడు తనయుడికి పంచ్ వేశాడు. రాజకీయాల్లో గెలుపోటముల గురించి మాట్లాడేది నువ్వా లోకేషూ అంటూ కొడాలి వేసిన ఈ పంచ్ కు లోకేష్ మళ్లీ స్పందించలేదు. నామినేటెడ్ మంత్రి అయిన నువ్వు గెలవడం గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించే సరికి లోకేష్ మళ్లీ ట్వీట్లు వేయలేదు!

ఇక జగనే ఇలా చేయించుకున్నాడు.. అంటూ లోకేష్ వేసిన ట్వీట్ కు కూడా బలమైన కౌంటర్ పడింది. ‘అధికారం కోసం ఎలాంటి నీచమైన పనులు అయినా చేయవచ్చు అని పోటీ పెడితే మీ బాబుని కొట్టే వాడు ప్రపంచంలోనే ఎవడూ లేడు. వెన్నుపోటుకి పర్యాయపదం నీ బాబు 40 ఏళ్ల చరిత్ర. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమకంతా పచ్చ గానే కనిపిస్తుందిరా లోకేశా..’ అంటూ కొడాలి నాని మరో కౌంటర్ ఇచ్చాడు

ఇక లోకేష్ ట్వీట్లలోని అక్షర దోషాల గురించి కూడా దెప్పి పొడిచాడు ఈ ఎమ్మెల్యే. ‘ఆశ్చరం కాదురా లోకేశా.. ఆశ్చర్యం అనాలి.. ఈ పకోడీ ట్వీట్లు వేయడం మానేసి వెళ్లి తెలుగు నేర్చుకో..#ShamelessTdP’’ అంటూ లోకేష్ కు మరో మొట్టికాయ వేశాడు కొడాలి నాని. ఈ ట్వీట్ పంచ్ లు పడేసరికి లోకేష్ మళ్లీ స్పందించకపోవడం గమనార్హం.