Home రాజకీయాలు దాడి జరిగిన జగన్ ని పరామర్శిస్తే ఆక్షేపణా?

దాడి జరిగిన జగన్ ని పరామర్శిస్తే ఆక్షేపణా?

SHARE

కేంద్రం పై తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ గరుడ అంటూ దుష్ప్రచారం చేస్తోందని, అసలు ఇటువంటి ఆపరేషన్ గరుడ పేరుతో ప్రజల్లో అనేక అపోహలు కల్పించడానికి తెదేపా ఎంతగానో ప్రయత్నిస్తోందని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

అసలు నిజానికి ఆపరేషన్ గరుడకి రచన, దర్శకత్వం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబే అని కన్నా విమర్శించారు. భాజపా కూడా దీనిపై తాము న్యాయపరంగా వెళ్లాలనే ఆలోచన లో ఉన్నామని ఆయన తెలిపారు.
అసలు రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలు బయట తిరిగే పరిస్థితి కూడా లేకుండా నెలకొందని కన్నా అన్నారు.

ఇక విపక్ష నేత జగన్ పై దాడి జరిగిన పిదప ఆయన్ను పరామర్శించడ౦ కూడా ఆక్షేపించే నీచ సంస్కృతికి తెలుగుదేశ౦ పార్టీ దిగజారిందని కన్నా అన్నారు.