Home రాజకీయాలు ఆపరేషన్ గరుడ.. అంతా వాళ్ల కనుసన్నల్లోనే?

ఆపరేషన్ గరుడ.. అంతా వాళ్ల కనుసన్నల్లోనే?

SHARE

ఏపీలో అమలవుతోందని అంటున్న ఆపరేషన్ గరుడ నిజమేనా? ఇది కుట్ర అని ఎవరైతే అంటున్నారో… దీన్ని అమలు చేస్తున్నది కూడా వాళ్లేనా? చాలా ప్లాన్డ్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారా? ఒకవైపు తమ ప్రత్యర్థులను దెబ్బతీయానికి మరోవైపు అదే సమయంలో సానుభూతి తమ మీదకు రావడానికి తెలుగుదేశం పార్టీనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందా? అంటే ఔను అని అంటున్నారు విశ్లేషకులు. ఈ ఆపరేషన్ గరుడ అంతా చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఉన్న పెద్ద అడ్డుగోడ ప్రజావ్యతిరేకత. బాబు పాలనపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ప్రబలింది. ఇప్పుడు దాన్ని తగ్గించుకోవడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే బాబు రూటు మార్చాడు. ప్రజావ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం మీదకు మళ్లించే యత్నం చాన్నాళ్లుగానే చేస్తున్నాడు. కేంద్రం మోసం చేసిందని, మోడీ మోసగాడు అని బాబు వాదిస్తూ వస్తున్నాడు. ప్రత్యేకహోదా ఇవ్వలేదని వాపోతున్నాడు. అయితే నాలుగేన్నరేళ్ల పాటు బీజేపీతో దోస్తీ చేసింది చంద్రబాబు నాయుడే. మోడీని మోసింది బాబే. మోడీ మళ్లీ ప్రధాని కావాలని అన్నది కూడా బాబే, మోడీకి ధన్యవాద తీర్మానాలు పాస్ చేసింది బాబే. హోదా వద్దన్నది బాబే. అయితే ఇప్పుడు హోదా ఇవ్వకుండా మోడీ మోసం చేశాడంటూ బాబు విరుచుకుపడుతున్నాడు.

ప్రతి రోజూ కేంద్రం మీద ఏదో ఒకటి అంటూ విరుచుకుపడుతున్నాడు. ఇలా తన చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి నాలుగేళ్ల తన ఫెయిల్యూర్స్ ను కవర్ చేసుకోవడానికి తనపై ప్రబలిన ప్రజా వ్యతిరేకతను కేంద్రం పైకి మళ్లించి, బీజేపీతో వైసీపీ, జనసేనలు దోస్తీ చేస్తున్నాయని చెప్పుకొంటూ పబ్బం గడుపుతున్నాడు చంద్రబాబు. ఇది బయటకు అర్థం అవుతున్న విషయం.

ఇదే వ్యవహారాన్ని ఆపరేషన్ గరుడ పేరుతో అంతర్గతంగా కూడా బాబు అమలు చేస్తున్నాడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ మీద అటాక్ ఆపరేషన్ గరుడలో భాగమే.. అయితే దీన్ని అమలు చేస్తున్నది మాత్రం చంద్రబాబు అండ్ కో అని వార్తలు వస్తున్నాయి. బాబు, లోకేష్ లకు బాగా కావాల్సిన ఒక మాజీ ఓఎస్డీ ఢిల్లీ లెవల్లో దీన్ని పర్యవేక్షిస్తున్నారని.. తీరా ఇప్పుడు జగన్ మీద అటాక్ చేయించి వాళ్లంతా తలోదిక్కుకు పారిపోయారని.. కొందరు అమెరికా చేరుకున్నారని.. ఎలాగూ ఏపీలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి.. మేనేజ్ చేయగలమనే ధైర్యంతో ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.