Home రాజకీయాలు బాబు రాజకీయంలో ఇది మరో నిస్సిగ్గు అధ్యాయం!

బాబు రాజకీయంలో ఇది మరో నిస్సిగ్గు అధ్యాయం!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన అరాజక రాజకీయం చేయడానికి ఏ మాత్రం సిగ్గు పడే టైపు కాదు. ఇలా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు, ఇలా మాటలు మార్చేస్తే జనాలు నన్ను నమ్ముతారా? మొన్ననే కదా ఇలా మాట్లాడాను.. ఇప్పుడు ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకోరా? అనే భయాలు చంద్రబాబుకు ఏ మాత్రం లేవు. ఉండవు. ఆయన రాజకీయ జీవితం అంతా ఇలాంటి నిస్సిగ్గుతనంతోనే సాగుతూ ఉంది. అందుకు నిదర్శనమే తాజాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఢిల్లీ పర్యటన.

ఏపీలో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు నాయుడు దాన్ని మసిపూసి మారేడు కాయ చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. అక్కడకు వెళ్లి ఏదేదో మాట్లాడాడు. ప్రజాస్వామ్యం, విలువల గురించి మాట్లాడాడు. వాటిని మోడీ నాశనం చేస్తున్నాడని విరుచుకుపడ్డాడు. బహుశా ఇంతకు మించిన కామెడీ మరోటి ఉండదు.

భారత రాజకీయంలో ప్రజాస్వామ్యం, దాని విలువల గురించి మాట్లాడకూడని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబు మాత్రమే. ఎందుకంటే.. తొలిసారి ఈయన ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడమే ప్రజాస్వామ్య యుతంంగా కాదు. రాష్ట్ర ప్రజలు ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే ఆయనను కూలదోసి తను అధికారాన్ని సొంతం చేసుకున్నాడు చంద్రబాబు. ఇక అక్కడ నుంచి చంద్రబాబు రాజకీయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు కూడా అప్రజాస్వామ్యికంగా పాతిక మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అనర్హత వేటు పడాల్సిన వాళ్లను మంత్రులుగా కొనసాగిస్తున్నాడు. ఇదీ చంద్రబాబు నాయుడి తీరు. ఇదీ చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న వ్యవస్థ పరిస్థితి. ఇలాంటి నేపథ్యం ఉన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, వ్యవస్థల గురించి లెక్చర్లు ఇవ్వడానికి మించిన నిస్సిగ్గుతనం ఏముంటుంది?