Home రాజకీయాలు జగన్ పై అటాక్… నిందితుడికి కోట్ల రూపాయలు..?!

జగన్ పై అటాక్… నిందితుడికి కోట్ల రూపాయలు..?!

SHARE

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం అసలు గుట్టు ఏమిటి? ఈ హత్యాయత్నం జగనే చేయించుకున్నాడని తెలుగుదేశం వర్గాలు తేల్చేస్తున్నాయి కదా.. మరి ఈ విషయంపై ఆ మేరకు ఎందుకు విచారణ చేయించడం లేదు? విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టించుకోవడం లేదు. దానిపై విచారణ చేయించాల్సిన అవసరమే లేదని ఎందుకు అంటున్నాడు? ఈ విషయంపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంటే.. ఏపీ ప్రభుత్వం ఎందుకు ఎదురుదాడి చేయిస్తోంది?

ఇలా అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ జగనే ఈ పని చేయించుకుని ఉంటే దాన్ని బయటపెట్టడం, తద్వారా ఆయనకే మైనస్ అయ్యేలా చేయడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద కథ కాదు. అయితే అందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. విచారణ అవసరమే లేదని మాట్లాడుతూ ఉన్నారు పచ్చ పార్టీ నేతలు. తాము ఇచ్చే స్టేట్ మెంట్లే చాలని అంటున్నారు. దీంతో జగన్ మీద జరిగిన హత్యాయత్నంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఆ సంగతలా ఉంటే.. జగన్ మీద అటాక్ చేసిన నిందితుడికి కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చారనే మాట వినిపిస్తోంది. జగన్ మీద అటాక్ చేయడానికి ముందు అతడి లైఫ్ స్టైల్ గురించి వస్తున్న వార్తలు సంచలనంగా ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి గాల్లో మేడలు కడుతూ వస్తున్నాడని తెలుస్తోంది. చాలా విలాసవంతంగా బతుకుతున్నాడని తెలుస్తోంది. పార్టీలు చేసుకోవడం.. సంబరాలు గ్రాండ్ గా చేసుకోవడం.. ఖర్చుకు వెనుకాడకపోవడం వంటివి చేశాడని అతడిని ఎరిగిన వారు చెబుతున్నారు.

అంతేకాదు..అతడు భూమిని కూడా బేరం చేశాడని, కోటి రూపాయల విలువలో భూమిని కొనాలని అనుకుంటున్నాను అంటూ తన ప్రాంతంలో కొంతమంది రియలెస్టేట్ ఏజెంట్లను కూడా సంప్రదించాడని వార్తలు వస్తున్నాయి. అయితే వారు ఇతడిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే.. అతడు ఇలా వార్తల్లోకి వచ్చాడు. దీన్ని బట్టి జగన్ మీద అటాక్ చేస్తే భారీ మొత్తమే ఇస్తామని శ్రీనివాసరావుకు ఎవరో భరోసాను ఇచ్చారని స్పష్టం అవుతోంది. అయితే ఇందులో కుట్ర కోణాన్ని బయటపడే అవకాశాలు లేవు. ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తోంది.