Home రాజకీయాలు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌ లకు కూడా పింఛను??

మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌ లకు కూడా పింఛను??

SHARE

అధికార కోసం ఎన్ని హామీలైనా ఇచ్చేసేలా వున్నాయి రాజకీయ పార్టీలు ఈ నాడు. కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ లకు ఇచ్చినట్లే మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌ లకు కూడా పింఛను ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మరో రెండు రోజుల్లో ఖరారు అవుతుందని తెలిపిన ఆయన ప్రతి జిల్లా హెడ్‌ కార్వర్టర్‌ లో ఓ మెడికల్‌ కాలేజీ.. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఓ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినట్లే వంద యూనిట్ల ఉచిత విద్యుత్‌ ను బీసీలకు కూడా అందించే మనవి గురించి పార్టీ లో చర్చించామని తెలిపారు. ఇక చేనేతల రుణమాఫీ గురించి కూడా తమ పార్టీ ఆలోచిస్తున్నట్లు కోమటిరెడ్డి వివరించారు.

అందర్నీ మెప్పించాలి…అందరి వోట్లూ కావాలి …అందుకే అందరికీ అన్నీ ఇచ్చేస్తామని చెప్పడానికి రాజకీయ పార్టీలు వెనుకాడటం లేదు