Home రాజకీయాలు తెలంగాణ రాజకీయం.. అనూహ్యమైన వలసలు!

తెలంగాణ రాజకీయం.. అనూహ్యమైన వలసలు!

SHARE

తెలంగాణ రాజకీయంలో ఆఖరి నిమిషంలో అనూహ్యమైన వలసలు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైపు జోరుగా వలసలు సాగుతూ ఉండటం గమనార్హం. ఒకవైపు మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అనే ప్రచారం గట్టిగా సాగుతూ ఉంది. మీడియా సంస్థలు, అధ్యయనాలు, సర్వేలు కూడా ఈ తరహా అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. టికెట్లు దక్కని ఆశావహులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజుల్లోనే పలువురు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్ పార్టీ వైపు చేరుతుండటం గమనార్హం.

ఒకవైపు కాంగ్రెస్ గమనం పడుతూ లేస్తూ సాగుతోంది. కచ్చితంగా అధికారాన్ని అందుకుంటుంది అనే నమ్మకాన్ని తటస్తుల్లో కూడా కలిగించలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ తెరాస నుంచి ఆ పార్టీలోకి వలసల జాతర సాగుతూ ఉండటం గమనార్హం.

ఇలా వలస నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు ఉండటం ఆసక్తిదాయకమైన అంశం. ముందుగా కొండా సురేఖ దంపతులతో వలసల వ్యవహారం కాక మీదకు వచ్చింది. తొలి రోజు కేసీఆర్ చేసిన అభ్యర్థుల ప్రకటనలో తన పేరుల లేదని సురేఖ అసహనభరితులు అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి కడిగేశారు. చివరకు ఆమె తెరాసను వీడారు. అలా తొలి వికెట్ పడింది.

ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, చేవేళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జి రత్నం, నల్లగొండ జిల్లా జడ్పీ చైర్మన్ బాలు నాయక్,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నారయణ్ ఖేడ్ నేత రాములు నాయక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి.. వీళ్లంతా తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరారు. ఎన్నికల ముందు ఇంత మంది నేతలు వలస పోవడం అంటే.. అది కూడా మళ్లీ అధికారం అందుకుంటుందన్న కేసీఆర్ పార్టీ నుంచి కోలుకోలేదన్న కాంగ్రెస్ లోకి ఇంత మంచి చేరడం విశేషమే. ఇంకా డీ శ్రీనివాస్ వలస బాటలోనే కనిపిస్తున్నాడు. మరి ఇలాంటి వలసలు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేయగలవా?