టీడీపీ నేతల మనసుల్లో జగన్ పై ఇంత కసి ఉంది!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరగిన వెంటనే టీడీపీ నేతలు స్పందించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. స్వయంగా ముఖ్యమంత్రి వెకిలి నవ్వులతో స్పందించడం. జరిగిన ఘటనను ఏ మాత్రం సీరియస్ గా తీసుకోకపోవడమే గాక.. అదంతా తమపై జరిగిన కుట్ర అని బాబు చెప్పుకొచ్చాడు. అలాగే జగన్ పై దాడి అనంతరం ఆయనను పరామర్శించిన వాళ్లను కూడా చంద్రబాబు తప్పు పట్టాడు. వాళ్లంతా తనపై కుట్ర చేస్తున్నారని అన్నాడు. అలా బాబు నీఛమనస్తత్వం బయటపడిపోయింది.

అదే అనుకుంటే తెలుగుదేశం పార్టీ నేతల స్పందనలు మరింత దారుణంగా ఉన్నాయి. జగన్ పై హత్యాయత్నం అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ.. వెకిలి నవ్వులతో స్పందించారు. అదంతా జగన్ అభిమాని చేసిన పని అంటూ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం గురించి వీరు మాట్లాడటం లేదు. ఇక మరికొందరు అయితే మరో అడుగు ముందుకు వేశారు. తాము జగన్ ను హత్య చేయించాలని అనుకుంటే.. ఇలా ఉండదని.. వీరు అంటున్నారు.

ఈ జాబితాలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు ఉన్నారు. వీళ్లు మరీ లేకి మాటలు మాట్లాడారు. జగన్ ను చంద్రబాబు నాయుడు హత్య చేయించాలని అనుకుంటే చాలా పకడ్బంధీగా చేయిస్తారని చెప్పుకొచ్చారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి హత్యకు గురి అయ్యారని, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మరణించారని.. వారిలాగే జగన్ ను కూడా చంపించేంత శక్తి బాబుకు ఉందని, బాబు అనుకుంటే ప్లాన్ ఇలా ఉండదని సోమిరెడ్డి చెప్పాడు.

అంటే హత్యారాజకీయం తమకు అలవాటు లేదు అని ఈ మంత్రి అనలేదు. తాము అనుకుంటే ప్లాన్ పక్కాగా చేస్తామని చెబుతున్నాడు. ఇక మరో టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. తాము అనుకుంటే జగన్ ను ముక్కలు ముక్కలుగా నరకగలమని రౌడీ మాటలు మాట్లాడాడు. తమ రౌడీయిజం ఎలా ఉంటుందో వివరించాడు. జగన్ మీద హత్యాయత్నం లో తెలుగుదేశం పార్టీ కుట్ర ఏమిటో కానీ.. ఈ నేతలు మాట్లాడిన మాటలు మాత్రం.. వీరికి జగన్ మీద ఎంత కసి ఉందో తేటతెల్లం చేస్తూ ఉన్నాయి.