Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం: బాబును కడిగేసిన బుగ్గన!

జగన్ పై హత్యాయత్నం: బాబును కడిగేసిన బుగ్గన!

SHARE

జగన్ పై హత్యాయత్నం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై తీవ్రంగా స్పందించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వెకిలి నవ్వులు నవ్వుతూ స్పందించాలని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇక జగన్ పై హత్యాయత్నం అనంతరం గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీతో మాట్లాడటాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టడాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు.

గవర్నర్ డీజీపీతో మాట్లాడకూడదు అని అనడం చంద్రబాబు మనస్తత్వాన్ని చాటుతోందని అన్నారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అని.. సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్ గవర్నర్ అనే అంశాన్ని బుగ్గన గుర్తు చేశారు. ప్రతిసారీ అసెంబ్లీ సమావేశాలప్పుడు గవర్నర్ తన ప్రసంగంలో ‘మై గవర్నమెంట్..’ అంటూ ప్రసంగాన్ని చేస్తాడని, ఆ విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. మై గవర్నమెంట్ అంటూ గవర్నర్ చేత తనకు ఇష్టమైన ప్రసంగాలు చేయించుకునే చంద్రబాబుకు ఇప్పుడు గవర్నర్ డీజీపీకి ఫోన్ చేయడం తప్పుడుఅయిపోయిందా? అని బుగ్గన ప్రశ్నించాడు.

ఇక హత్యాయత్నం అనంతరం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్లడాన్ని ఏ విధంగా తప్పు పడతారు? అని బుగ్గన ప్రశ్నించాడు. ఇప్పటి వరకూ టీడీపీ నేతలు కనీసం జగన్ ను పరామర్శించకపోవడం వారి తీరును తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.

మరోవైపు బాబు తీరును తీవ్రంగా దుయ్యబట్టాడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి తను ఆశ్చర్యపోయాను అని.. చంద్రబాబుకు కనీసం మానవతా ధోరణి లేకుండా పోయిందని తలసాని అన్నారు. మానవతా ధోరణితో తమ పార్టీ నేతలు జగన్ ను పరామర్శిస్తే దాన్ని తప్పుపట్టడం చంద్రబాబుకే చెల్లిందని తలసాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నీకు అస్సలు సిగ్గుందా? అని తలసాని తీవ్రంగా ప్రశ్నించారు.