Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం.. బాబు నీఛ మనస్తత్వం!

జగన్ పై హత్యాయత్నం.. బాబు నీఛ మనస్తత్వం!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు ఆయన నీఛమనస్తత్వానికి అద్దం పడుతోందని అంటున్నారు విశ్లేషకులు. జగన్ మీద దాడి జరిగితే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఖండించాలి. దీని వెనుక ఎవరున్నారో తేలుస్తాం అని అనాలి. అయితే బాబు మాత్రం.. ఇదంతా కుట్ర అని, కేంద్ర ప్రభుత్వం కుట్ర అంటూ మొదలుపెట్టాడు. ఏం జరగినా ఈ మధ్య కాలంలో కేంద్రం మీద విరుచుకుపడుతూ ఏదో రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు జగన్ పై హత్యాయత్నం విషయంలో కూడా అలాగే వ్యవహరించాడు.

అది మాత్రమే కాదు..చంద్రబాబు నీఛ రాజకీయం మరోటి ఏమిటంటే.. జగన్ మీద సానుభూతి కురిపించిన వాళ్లపై మండి పడటం. జగన్ పై దాడి జరగగానే కేటీఆర్, కవిత, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ లాంటి వాళ్లు స్పందించడాన్ని చంద్రబాబు తప్పు పట్టాడు. వాళ్లంతా ట్వీట్ల ద్వారా జగన్ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోరుకోవాలని వ్యాఖ్యానించారు.

ఇందులో చంద్రబాబుకు చాలా దోషం కనిపించింది. వాళ్లంతా మానవతా ధోరణితో మాత్రమే స్పందించారు. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత పై హత్యాయత్నం జరిగితే స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే చంద్రబాబుకు ఇదే పెద్ద తప్పు అయిపోయింది. వాళ్లు పరామర్శించారు కాబట్టి.. వాళ్లంతా కలిసి తన మీద కుట్ర చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు.

అక్కడ దాడి జరిగింది , హత్యాయత్నం జరిగింది జగన్ మీద. ఆయనే చాలా ధీరత్వంతో స్పందిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇందులో కూడా తన నీఛమనస్తత్వంతో స్పందిస్తూ నీఛ రాజకీయానికి పాల్పడుతూ ఉండటం గమనార్హం.