Home ప్రత్యేకం జగన్.. అదే ధీరత్వం.. హత్యాయత్నంపై స్పందన!

జగన్.. అదే ధీరత్వం.. హత్యాయత్నంపై స్పందన!

SHARE

తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో స్పందించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇలాంటి పిరికి పందల చేష్టలకు తను భయపడను అని స్పష్టం చేస్తూ.. తన ధీరత్వాన్ని చాటుకున్నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దాడి జరిగినప్పటి నుంచి జగన్ ను వీడియోల్లో, ఫొటోల్లో చూస్తుంటే ఎక్కడా ఆందోళన కనిపించడం లేదు. కత్తితో జగన్ మీద విషప్రయోగం జరిగి ఉండవచ్చని వైసీపీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విష రసాయనాలను జగన్ మీద ప్రయోగించడానికి ఇలాంటి హత్యాయత్నం జరిగిందా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ ఆలోచనే వైసీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అయితే జగన్ లో మాత్రం ఇలాంటి భయాందోళనలు ఏమీ కనిపించడం లేదు. జగన్ ధీరుడిలానే స్పందిస్తున్నాడు. దాడి జరిగిన అనంతరం కూడా జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ పోర్టులో ప్రజలకు అభివాదం చేసుకుంటేనే సాగాడు. ఇక హైదరాబాద్ చేరుకున్నాకా కూడా జగన్ మోహన్ రెడ్డి ధీమాగానే కనిపించారు.

ఇక ట్విటర్లో అయితే జగన్ మరింత ధీమాగా స్పందించారు. తనకు ఏమీ కాలేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందనక్కర్లేదని జగన్ ట్వీట్ చేశారు. తను క్షేమమని జగన్ తెలియజేశారు. ప్రజల, దేవుడి ఆశీర్వాదంతో తను క్షేమమని జగన్ వివరించారు. ఇలాంటి పిరికి పంద చేష్టలకు తను భయపడను అని జగన్ ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు తనను ఆపలేవని.. ఏపీ ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని ఇలాంటి దాడులు మరింత ప్రబలం చేస్తాయని జగన్ ట్విటర్లో పేర్కొన్నారు.

ఈ సంఘటనతో తెలుగుదేశం పార్టీ హీన రాజకీయం.. బయటపడుతూ ఉండగా, జగన్ మోహన్ రెడ్డి ధీరత్వం బయటపడుతూ ఉంది.