Home రాజకీయాలు జగన్ హత్యాయత్నం… ఇది ప్రజాస్వామ్యంపై హత్యాయత్నం

జగన్ హత్యాయత్నం… ఇది ప్రజాస్వామ్యంపై హత్యాయత్నం

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చగా మారింది. జగన్ హత్యాయత్నం జరిగింది విమానాశ్రయంలో కావడంతో అది మరింత సంచలనం అయ్యింది. దీంతో తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విమానాశ్రయ శాఖ బాధ్యతల్లో ఉన్న హర్షవర్దన్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. జగన్ పై దాడిని ఆయన ఖండించారు. ఈ సంఘటనలో నిందితులను శిక్షిస్తామని ఆయన ప్రకటించారు.

ఇక తెలంగాణ రాజకీయ ప్రముఖులు కూడా అంశంపై స్పందించారు. కేటీఆర్ స్పందిస్తూ జగన్ పై దాడిని ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, జగన్ త్వరగా కోరుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అలాగే తెరాస ఎంపీ కవిత కూడా ఈ అంశంపై స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ జగన్ మీద హత్యాయత్నాన్ని ఖండించారు. జగన్ త్వరగా కోలుకోవాలని లోకేష్ ట్వీట్ చేశారు.

చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతల ముందు ఈ ఘటనను ఖండించాడట. స్వయంగా ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి మీడియా ముఖంగా స్పందించకపోవడం విడ్డూరం. అయితే చంద్రబాబు మరోలా మాట్లాడాడు అట. జగన్ పై హత్యాయత్నాన్ని అడ్డం పెట్టుకుని అల్లర్లు చేస్తే సహించేది లేదని బాబు అన్నాడట. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించలేని చంద్రబాబు ఇలా మాట్లాడటం విడ్డూరమే.

ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత జనారెడ్డి జగన్ ను పరామర్శించారు. హైదరాబాద్ లో జగన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి జానా రెడ్డి పరామర్శించారు. ఈ హింసావాదాన్ని ఖండిస్తున్నామని జానా అన్నారు.

ఒకటైతే కచ్చితంగా చెప్పవచ్చు. ఇది కేవలం జగన్ మీద జరిగిన హత్యాయత్నం కాదు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన హత్యాయత్నం. దీన్ని ప్రజలంతా గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారం చేతిలో ఉంది కదా.. అని ఇలాంటి పనులు చేస్తే ..అందుకు తీవ్రమైన ప్రతిఫలాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.