Home రాజకీయాలు తెలంగాణలో టీడీపీ పతనావస్థ.. టీజేఎస్ సత్తా!

తెలంగాణలో టీడీపీ పతనావస్థ.. టీజేఎస్ సత్తా!

SHARE

మహాకూటమిలో సీట్లను సాధించుకోవడంలో తెలుగుదేశం పార్టీకి ఏమీ తీసిపోవడం లేదు తెలంగాణ జనసమితి. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ పార్టీ ఇప్పుడు మహాకూటమిలో 10 టికెట్లను సంపాదించుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇది నిన్నలా మొన్న ఏర్పడిన పార్టీ. దీని సత్తా ఏమిటో ఎవరికి తెలియదు. దీనికి ఉన్న ఊపిరల్లా కోదందరాం ఇమేజ్. కోదండరాం ఇమేజ్ మీదే ఈ పార్టీ పోటీ చేయాలి.

విద్యావంతుల ఓట్లు ఈ పార్టీకి పడతాయి అనే అంచనాలున్నాయి. అయితే కోదండరాంకు అంతసీన్ లేదని కేసీఆర్ తేల్చేస్తున్నాడు. తను లేకపోతే కోదండరాం ఎవరు? అని కూడా కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు. ఓవరాల్ గా అయితే టీజేఎస్ మీద భారీ అంచనాలు అయితే లేవు,

అయినప్పటికీ ఆ పార్టీ ఏకంగా 10 సీట్లలో పోటీకి రెడీ అయిపోతోంది. కాంగ్రెస్ పార్టీ మెడ మీద కత్తి పెట్టి కోదండరాం పార్టీ ఈ మేరకు సీట్లను సంపాదించుకుంటోంది. ఇక ఇదే కూటమిటో భాగస్వామి అయిన టీడీపీ మాత్రం 12 సీట్లకు పరిమితం అయిపోతోంది. కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను ఇస్తానని అంటోందని.. దానికి తాను ఒప్పుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు.

దీంతో టీడీపీ శ్రేణులు ఖిన్నులయ్యారు. మరీ 12 సీట్లేనా..గత ఎన్నికల్లో నెగ్గినన్ని సీట్లలన్నింటినీ అయినా కావాలని శ్రేణులు అడిగినా..బాబు మాత్రం వారిని వారించాడు. పొత్తు ముఖ్యం అని అదనంగా సీట్లను డిమాండ్ చేయలేనని బాబు స్పష్టం చేశాడు. ఒకవైపు ఇంకా తాడూ బొంగరం లేని కోదండరాం పార్టీ పది సీట్లను పొందితే.. పొత్తులో గట్టిగా సీట్లను కూడా అడగలేని స్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలోనే టీడీపీ ఆవిర్భవించిందని చెప్పుకొంటారు. కానీ వాస్తవంలో మాత్రం టీడీపీ పరిస్థితి తెలంగాణలో ఇలా ఉన్నట్టుంది!