Home రాజకీయాలు ఎన్నికలు వచ్చాయే అనుకో..ఏం చేస్తావ్ పవనూ!

ఎన్నికలు వచ్చాయే అనుకో..ఏం చేస్తావ్ పవనూ!

SHARE

పంచాయతీ ఎన్నికలు తక్షణం నిర్వహించాలని అంటున్నాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఈ డిమాండ్ ను చాలా గట్టిగా వినిపిస్తున్నాడు. అలాగే సీపీఐ, సీపీఎం నేతలు కూడా తక్షణం పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇక లేట్ చేయకూడదని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. వీళ్లు డిమాండ్ చేయడం అయితే బాగుంది కానీ.. నిజంగానే పంచాయతీ ఎన్నికలు వచ్చాయని అనుకుందాం.. అప్పుడు ఈ పార్టీల పరిస్థితి ఏమిటి?

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు జంకుతున్నాడు. ఆయన భయాలు ఆయనకు ఉన్నాయి. అయితే మరీ సవాల్ చేసే పొజిషన్లలో జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయా? అనేద ప్రశ్న.

ఎందుకంటే.. పవన్ పార్టీకి ఇంకా క్షేత్ర స్థాయిలో ఎలాంటి నిర్మాణం లేదు. పంచాయతీ ఎన్నికలు జరిగేదేమో గ్రామాల స్థాయిలో. ఈ ఎన్నికలను ప్రజలు కొన్ని చోట్ల పార్టీల వారీగా చూస్తారు, మరి కొన్ని చోట్ల పార్టీలతో నిమిత్తం లేకుండా ఇవి జరుగుతాయి. కొన్ని చోట్ల ఒక పార్టీ వర్సెస్ మరో పార్టీ అన్నట్టుగా ఎన్నికలు జరుగుతాయి. మరి కొన్ని చోట్ల ఒకే పార్టీ వాళ్లు కూడా వేర్వేరై పోటీ చేస్తారు. అదంతా స్థానిక పరిస్థితులను అనుగుణంగా ఉంటుంది.

ఇలాంటి ఎన్నికల విషయంలో పవన్ మరీ ఎక్కువగా ఉద్రిక్తుడు అయిపోతున్నాడు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేసేయాలని అంటున్నాడు. ఎన్నికలు అవసరమే కానీ.. ఈ ఎన్నికల్లో పవన్ కు సత్తా చూపించేంత ఏమీ ఉండదు. అయినా పవన్ మాత్రం.. ఎన్నికల వస్తే చాలు సత్తా చూపించేస్తా.. అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయినా అప్పుడెప్పుడో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే పోటీ చేస్తా అని పీకే ప్రకటించాడు. ఆ తర్వాత వచ్చిన వివిధ ఉప ఎన్నికల్లో కూడా పవన్ సత్తా చూపించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం పంచాయతీ ఎన్నికలు అంటున్నాడు. కామెడీగా లేదూ?