Home రాజకీయాలు బాబు పంచాయతీ ఎన్నికలకు రెడీ…కానీ..ట్విస్టు ఇదిగో

బాబు పంచాయతీ ఎన్నికలకు రెడీ…కానీ..ట్విస్టు ఇదిగో

SHARE

ఏపీలో పంచాయితీ ఎన్నిక‌లు మూడునెల‌ల్లో నిర్వ‌హించాల‌ని ఉమ్మ‌డి హైకోర్టు ఏపీ స‌ర్కార్‌ ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాదు స్పెషల్ ఆఫీస‌ర్ల పాల‌న‌ కోసం జారీ చేసిన జీవో నెంబ‌ర్ 90ను కూడా కోర్టు కొట్టివేసింది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పంచాయితీ ఎన్నిక‌ల పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై స్పందించారు.

పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవ‌ని.. రిజ‌ర్వేష‌న్ల చ‌ట్టానికి సంబంధించిన అంశం కోర్టు ప‌రిధిలో ఉండ‌డం వ‌ల్ల‌నే పంచాయితీ ఎన్నిక‌లకు ఆల‌స్యం అవుతోందని బాబు తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల అంశం తేలిన వెంట‌నే తాము పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించేదుకు సిద్ధ‌మ‌ని.. స్థానికి సంస్థ‌ ల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే టీడీపీ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని కూడా బాబు స్ప‌ష్టం చేశారు.

మరి అది తేలేది ఎప్పుడో…బాబు కె ఎరుక!!