Home రాజకీయాలు బెయిల్ ఔట్ ఎప్పుడు ఇస్తారో లోకేష్ కి అసలు తెలుసా?

బెయిల్ ఔట్ ఎప్పుడు ఇస్తారో లోకేష్ కి అసలు తెలుసా?

SHARE

బీజేపీ నేతల తీరు పై ఆంధ్ర ప్రదేశ్ ఐ టీ శాఖామాత్యులు లోకేష్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తీరు ‘దొంగే… దొంగ దొంగ’ అని అరిచినట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు నుంచి రాఫెల్ యుద్ధ విమానాల వరకు దేశాన్ని దోచేశారని… ఇప్పుడు అగ్రిగోల్డ్ పేరు తో దొంగదీక్షకు దిగటం హాస్యాస్పదమని లోకేష్ అన్నారు …ఆనాడు నోట్ల రద్దు అంశం బాబు దాదాపుగా తన ఖాతాలో వేసుకున్నారన్న సంగతి లోకేష్ కి గుర్తులేదు కావొచ్చు.

ఇంకా దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా నుంచి తిత్లీ తుపాను బాధితులను ఆదుకునే వరకు ఏపీ ని బీజేపీ ఎంతో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. దేశంలో ఏపీ భాగం కాదనే ధోరణి తో ఆ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని కూడా లోకేష్అ న్నారు.

అగ్రిగోల్డ్ అంశం కోర్టు పరిధిలో ఉందని, బాధితులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని లోకేష్ తెలిపారు. కోర్టులను కూడా కించపరుస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. తగిన ఆధారాలు ఉంటే చూపాలని, అనవసర ఆరోపణలు మానుకోవాలని సూచించారు. బీజేపీ కి చిత్తశుద్ధి అనేది ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకు కేంద్ర౦ బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసలు బెయిల్ ఔట్ ఎప్పుడు ఇస్తారో లోకేష్ కి తెలుసా…కనీసం ముఖ్యమంత్రికి తెలుసా?

కేంద్రం పంపే నిధులన్నీ ఆమ్ ఫట్ అని మింగేస్తూ ఇంకా నిధులివ్వరని దెప్పిపొడుపులా…? దమ్ముంటే కాగ్ నివేదిక పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయించాలి.