Home రాజకీయాలు స్టార్ క్రికెటర్లపై బీజేపీ వల..!

స్టార్ క్రికెటర్లపై బీజేపీ వల..!

SHARE

వచ్చే ఎన్నికల్లో సెలబ్రిటీలను స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకోవడానికి వీలైతే వాళ్లను పోటీ చేయించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా కొన్ని లీకులను కూడా ఇస్తోంది. తమ పార్టీ తరఫున స్టార్ క్రికెటర్లు పోటీ చేయనున్నారని కమలం పార్టీ మీడియాకు లీకులు ఇస్తోంది. ఇందులో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మరో స్టార్ క్రికెటర్ గంభీర్ లను బీజేపీ బరిలోకి దించనుందనే ప్రచారం ఊపందుకుంటోంది.

వీరిద్దరినీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోందని, ఒకవేళ అలా కుదరనిపక్షంలో వారిని తమ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్స్ గా దించడానికి కమలం పార్టీ ప్రయత్నాలు సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది.

ధోనీని రాంచీ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని, గంభీర్ ను న్యూఢిల్లీ నుంచి ఎంపీగా బరిలోకి దించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోందట. అయితే దీనికి ఇంకా ఆ క్రికెటర్ల నుంచి సమ్మతి వచ్చిందనే ఖబర్ ఏమీ లేదు. ఒట్టి బీజేపీ ఆలోచన మాత్రమే ఇది.

దీనికి ఆక్రికెటర్లు ఓకే అంటారా అనేది సందేహమే. వీరిలో ధోనీకి ఇంకా క్రికెట్ కెరీర్ ఉంది. అంత ఫామ్ లో లేకపోయినా జట్టులో కొనసాగుతున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ధోనీ ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో అతడు ఉన్నట్టుండి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేనట్టే. గంభీర్ ను బీజేపీ ఏమైనా కన్వీన్స్ చేస్తుందేమో!