Home రాజకీయాలు కడప తర్వాత.. వైసీపీ స్వీప్ ఆ జిల్లాలోనే?

కడప తర్వాత.. వైసీపీ స్వీప్ ఆ జిల్లాలోనే?

SHARE

వచ్చే ఎన్నికల రాజకీయ పరిణామాలు హాట్ హాట్ గా మారుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏపీ రాజకీయంలో ఎవరిది పై చేయి అవుతుంది? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ముక్కోణపు పోరు తప్పదని స్పష్టం అవుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏ జిల్లా ఎవరికి సానుకూలంగా ఉంటుందనే చర్చ సాగుతూ ఉంది. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ప్రతిబంధకం. అలాగే బాబుకు ఎవరూ మిత్రులుగాకలిసి వచ్చేలా లేరు.

బీజేపీ, జనసేనలు దూరం అయినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆటలో అరటి పండు. ఇక జనసేన బలం కొన్ని జిల్లాలకు, అందునా కొన్ని నియోజకవర్గాలకు పరిమితం. పవన్ కల్యాణ్ కాన్సన్ ట్రేషన్ కూడా ఒకటీ రెండు జిల్లాల మీదే ఉంది. అయితే అక్కడ కూడా జనసేనలోకి అతిరథ మహారథులు రావడం లేదు. ఏ పార్టీలోనూ టికెట్ దక్కని వారు మాత్రమే వస్తున్నారు. వీళ్లతో ఎంత ప్రయోజనం ఉంటుందో ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.

ఆ సంగతలా ఉంటే.. వైసీపీ కొన్ని జిల్లాల్లో ఉరకలేసే ఉత్సాహంతో కనిపిస్తోంది. రాయలసీమ వైసీపీకి పూర్తిగా ఆటపట్టు అయిపోయింది.గత ఎన్నికల్లోనే అనంతపురం మినహాయిస్తే మిగతా సీమలో మెజారిటీ సీట్లను వైసీపీనే నెగ్గింది. ఈ సారి అనంతపురంలో కూడా తమదే పై చేయి అవుతుందని వైసీపీ విశ్వాసంతో ఉంది. సీమ తర్వాత వైసీపీకి మరో జిల్లాలో కూడా పుష్కలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్రేటర్ రాయలసీమ అనదగ్గ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపికి మంచి ఛాన్స్ లు ఉన్నాయని స్పష్టం అవుతోంది. రాజకీయ పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నెల్లూరులో అయితే.. వైసీపీకి తిరుగులేదనే మాట వినిపిస్తోంది. ఇక్కడ జగన్ పార్టీ స్వీప్ చేయడం ఖాయమని.. కడప జిల్లాలో స్వీప్ చేసేంత స్థాయిలో నెల్లూరులో కూడా వైసీపీ స్వీప్ చేయడం ఖాయమని నెల్లూరు పరిణామాలను గమనిస్తున్న వాళ్లు అంటున్నారు.