Home ప్రత్యేకం కాంగ్రెస్‌లో చేరినా ఇంకా టీడీపీ నేతే!

కాంగ్రెస్‌లో చేరినా ఇంకా టీడీపీ నేతే!

SHARE

పేరుకు అయితే కాంగ్రెస్ పార్టీ నేత, ఇంకా టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. ఈ రకంగా చేరిన కొన్నాళ్లలోనే కాంగ్రెస్ లో చాలా ఎత్తుకే ఎదిగిపోయాడు రేవంత్ రెడ్డి. వేరే వాళ్లు అయితే కాంగ్రెస్ లో చేరితే అక్కడ మందలో ఒకడిగా మిగిలిపోవాల్సి వచ్చేది. అయితే రేవంత్ మాత్రం చాలా త్వరత్వరగానే ఎదిగిపోయాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయాంగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అక్కడ హీరో అయిపోయాడు.

ఇక కాంగ్రెస్ ను రేవంత్ ఏ మేరకు ఉద్ధరిస్తాడో ఇప్పుడప్పుడే తెలియదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఉద్ధరించడం మాటేమిటో కానీ.. రేవంత్ వల్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ ముప్పు తిప్పలు పడుతోంది. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ఏం కదిలించినా కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి వస్తోంది. తెలుగుదేశం పార్టీ తలనొప్పి అయిన ఓటుకు నోటు కేసును కాంగ్రెస్ ఇలా తగిలించుకుంది. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ ను రేవంత్ ఉద్ధరించడం కాదు.. రేవంత్ వల్ల కాంగ్రెస్ చాలా తలొనొప్పి ఎదుర్కొంటోంది.

ఆ సంగతలా ఉంటే.. రేవంత్ రెడ్డి పేరుకైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కానీ.. ఈయనలో తెలుగుదేశం పార్టీ వాసనలు మాత్రం పోలేదని స్పష్టం అవుతోంది. తాజాగా ఒక మీడియా బాస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ మాట తీరును చూస్తే.. ఇతడు తెలుగుదేశం నేత? లేక కాంగ్రెస్ నేత? అనే సందేహం కలిగింది. రేవంత్ రెడ్డి ఎంతసేపూ చంద్రబాబు గురించినే మాట్లాడాడు.

అంతే కాదు.. తనపై తుపాకీ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారని, చంద్రబాబు నాయుడిని తాకాలంటే తనను దాటుకుని వెళ్లాలని డైలాగులు వేశాడు. ఇలా ఎలా చూసినా రేవంత్ రెడ్డిలో తెలుగుదేశం పార్టీ నేత కనిపిస్తున్నాడు కానీ.. కాంగ్రెస్ పార్టీ నేతగా కనిపించడం లేదు ఈయన.