Home సినిమా వివాహం చేసుకుంటున్న మరో హీరో,హీరోయిన్!

వివాహం చేసుకుంటున్న మరో హీరో,హీరోయిన్!

SHARE

మరో హీరోహీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అవుతున్నారు. భారతీయ సినిమాలో ఇప్పటి వరకూ చాలా మంది హీరోహీరోయిన్లు ఎంచక్కా పెళ్లి చేసుకుని సెటిల్ కాగా.. ఇప్పుడుఈ జాబితాలో మరో జంట చేరుతోంది. ఈ సారి వంతు దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్ లది. వీళ్లిద్దరూ ప్రేమజంటగా సినీ ప్రేక్షకులకు సుపరిచితులే.

వీళ్ల ప్రేమకథ చాన్నాళ్లుగా సాగుతోంది. సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ తమ ప్రేమకథను దాచేయలేదు కూడా. బహిరంగంగా రొమాన్స్ చేసుకొంటూ కూడా వీళ్లిద్దరూ పలు సార్లు మీడియాకు కనిపించారు. అలా సాగుతున్న ఈ ప్రేమకథ పెళ్లి బాట పడుతుందా? అనేది నిన్నటి వరకూ ప్రశ్నార్థకమైన అంశం. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాన్నాళ్లుగా రూమర్లు అయితే వినిపిస్తున్నాయి కానీ.. బాలీవుడ్ లో ప్రేమలో పెళ్లి వరకూ వెళ్తాయా అనేది ఎప్పటికీ ఒక సందేహమే.

అయితే అలాంటి ఊహాగానాలకు తెరదించుతూ దీపిక, రణ్ వీర్ లు తమ పెళ్లి డేట్ ను ప్రకటించారు. వచ్చే నెల 14,15 తేదీల్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వీరిద్దరూ ధ్రువీకరించారు. అయితే తమ పెళ్లి ఎక్కడో మాత్రం వీరిద్దరూ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తానికి ప్రేమించుకోవడమే కాదు.. తాము పెళ్లి కూడా చేసుకుంటూ తమ ప్రేమ నిజమైనదే అని ఈ జంట నిరూపించుకుంటోంది.