Home రాజకీయాలు బాలయ్య అల్లుడికి సీటుకు ఇంట్లోనే పోటీ?

బాలయ్య అల్లుడికి సీటుకు ఇంట్లోనే పోటీ?

SHARE

నందమూరి నటసింహం బాలయ్య చిన్నల్లుడు భరత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. విశాఖపట్టణం సీటు నుంచి భరత్ పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా విశాఖ సీటును బీజేపీకి ఇచ్చింది టీడీపీ. ఈ సారి ఎలాగూ పొత్తు ఉండదు కాబట్టి.. తెలుగుదేశం అక్కడ అభ్యర్థిని రెడీ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో బాలయ్య అల్లుడికే ఆ సీటు దక్కుతుందని ప్రచారం జరుగుతూ వస్తోంది.

కేవలం బాలయ్య అల్లుడనే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాగా కావాల్సిన వ్యక్తి అయిన ఎంవీవీఎస్ మూర్తి మనవడు కావడం కూడా భరత్ కు ఉణ్న పెద్ద అర్హత. ఆర్థిక బలం విషయంలో మూర్తి కుటుంబం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మూర్తి కుటుంబానికే ఈ సీటు అని ప్రచారం జరిగింది. వారిలో భరత్ కు ఖాయమని అన్నారు.

అయితే ఇటీవలే మూర్తి చనిపోయారు. అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూర్తి కుటుంబానికే సీటు దక్కే అవకాశాలు మరింతగా పెరిగాయి. అయితే భరత్ కు దక్కుతుందా? అనేది మాత్రం కొశ్చన్ మార్క్ అవుతోంది. ఎందుకంటే.. మూర్తి కుటుంబంలోనే ఇప్పుడు ఈ సీటు విషయంలో కొత్త పోటీ దారులు తయారవుతున్నారట.

మూర్తికి ఇద్దరు తనయులు. వారిలో ఒక తనయుడి కొడుకు భరత్. మరో తనయుడికి కూడా ఒక కొడుకు ఉన్నాడట. అతడేమో తనకు విశాఖ ఎంపీ సీటు కావాలన్నట్టుగా మాట్లాడుతున్నాడని సమాచారం. ఇలా మూర్తి కుటుంబంలోనే టికెట్ విషయంలో పోటీ మొదలైందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వ్యవహారాన్నిచంద్రబాబు నాయుడు ఎలా సెటిల్ చేస్తాడో!