Home ప్రత్యేకం ఏపీలో దోచి తెలంగాణలో పంచుతున్నారా?

ఏపీలో దోచి తెలంగాణలో పంచుతున్నారా?

SHARE

తెలంగాణ ఎన్నికలకు ఇంకా నామినేషన్లే పడలేదు కానీ.. అప్పుడే నోట్ల కట్టలు మాత్రం పట్టుపడుతున్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అనామక లీడర్లే అరవై లక్షల రూపాయల మొత్తంతో పట్టుబడటం సంచలనం రేపుతోంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చాడట. మొత్తం ఎన్నికల ఖర్చు పెట్టుకుంటాను అని. మీరు పొత్తు పెట్టుకోండి చాలు.. మిగతాది తను చూసుకుంటా అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడట కాంగ్రెస్ పార్టీకి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కూడా ఖుష్ అయ్యారు.

తాజాగా టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణసొంత నియోజకవర్గం జగిత్యాలకు తరలుతున్న అరవై లక్షల రూపాయల మొత్తాన్ని పోలీసులు పట్టుకున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతా ఓపెన్ చేసింది.

ఇదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం అధినేత ఏపీలో దోచి ఇలా తెలంగాణలో పంచుతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. గత నాలుగున్నరేళ్లలో చంద్రబాబు నాయుడు అవినీతి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. తెలంగాణలో ఎమ్మెల్యేను కోనబోయిన ఐదు కోట్ల రూపాయల మూలాలు కూడా ఏపీలోనే ఉన్నాయనే టాక్ వినిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి పరిశోధన కొనసాగుతూ ఉంది.

ఇంతలోనే మళ్లీ అరవై లక్షల రూపాయల మొత్తంతో తెలుగుదేశం పార్టీ వాళ్లు పట్టుబడ్డారు. ఇందుమూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీని నోట్ల రాజకీయంలో కొట్టేవాడు లేడనేది. ఎన్ని ఓటుకు నోటు కేసుల్లో చిక్కుకున్నా టీడీపీ ఇలా ధన రాజకీయం చేస్తూనే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.