Home రాజకీయాలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కేటీఆర్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కేటీఆర్

SHARE

తెలంగాణా వచ్చిన రాహుల్ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. నవ తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. తెరాస పై పలు విమర్శలు చేశారు. అంబేద్కర్ పై కేసీఆర్ కు గౌరవం లేదని అందుకే ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును తొలగించారంటూ రాహుల్ అన్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ అధినేత రాహుల్ చేసిన వ్యాఖ్యల పై కేటీఆర్ వేగంగా స్పందించారు.ఆదిలాబాద్ జిల్లాలో అంబేద్కర్ పేరు మీదనే అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ గుర్తించలేదని, అసలు భారతరత్న ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేసిందని గుర్తుచేశారు వీపీ సింగ్ ప్రభుత్వం అంబేద్కర్ ను భారతరత్నతో గౌరవించిందని తెలియ చేశారు. అలానే తెలుగుబిడ్డ పీవీ నరసింహారావును కూడా కాంగ్రెస్ ఏ విధంగా అవమానించింధో ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.

రైతుల ఆత్మహత్యలపై మాట్లాడిన రాహుల్ సిగ్గుపడాలని… 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనతోనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 17 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచారని చెప్పారు. ప్రాణహిత, కాళేశ్వరం ఖర్చు రూ. 80 వేల కోట్లని కేంద్ర జల సంఘమే చెప్పిందని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం తర్వాత పరిహారం భారీగా పెరిగిందని చెప్పారు.