Home సినిమా నందమూరి అభిమానులకి ఊహించని కానుక

నందమూరి అభిమానులకి ఊహించని కానుక

SHARE

ఇది ఎవరూ ఊహించనిది…నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం. బాలకృష్ణ , జూ ఎన్టీఆర్ ఇద్దరూ కలసి సందడి చేస్తే..? ఇది నిజం కాబోతోంది.

వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్, పూజా హెగ్డే కాంబినేషన్లో దర్శకుడు త్రివిక్రమ్ తీసిన సినిమా ‘అరవింద సమేత’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ హైదరాబాదు లోని శిల్పకళా వేదిక లో విజయోత్సవ సభ ను రేపు నిర్వహించనున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తున్నారు. కల్యాణ్ రామ్ కూడా ఈ వేడుకకు హాజరౌతున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదికను పంచుకోవటం ఇది. ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచుతుంది అనడంలో అతిశయం లేదు. అప్పుడెప్పుడో బాలయ్య ‘సింహా’కు సంబంధించిన కార్యక్రమానికి తారక్ వచ్చాడు మళ్ళీ ఇన్నాళ్లకు…!!!