Home రాజకీయాలు సీఎం రమేష్ ….అరెస్ట్ త‌ప్ప‌దా?

సీఎం రమేష్ ….అరెస్ట్ త‌ప్ప‌దా?

SHARE

బాబు కు అత్యంత సన్నిహితుడు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలు ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్‌ కాంట్రాక్టుల ముసుగు లో చేయని పనులు చేసినట్లుగా చూపి బిల్లులు పెట్టడం నించి ఆ డబ్బు షెల్ కంపెనీ ల్లోకి మళ్లించి వాటి నుంచి తిరిగి సీఎం రమేశ్‌ సంస్థ వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి.

ఇటీవల జరిగిన సోదాల్లో దాదాపుగా 100 కోట్ల వరకు మళ్ళించినట్టు గుర్తించారు …అయితే ఆ 100 కాస్త 800 కోట్ల వరకు ఉండవచ్చని అంటున్నారు. 100 కోట్లు దారిమళ్ళాయని అధికారులు నిర్ధారించగా మరో 700 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు కనుగొన్నారని వార్త.

డొల్ల కంపెనీల ద్వారా 100 కోట్ల రూపాయలను దారిమళ్ళించారనేందుకు పక్కా ఆధారాలు లభించాయి. అలానే మరో 700 కోట్లు అనుమానాస్పద లావాదేవీలు కూడా ఐటి గుర్తించిందట. ఈ లావాదేవీల‌కు సంబంధించి లెక్క‌లు సాయిబాబా సమాధానం చెప్పలేకపోయారు. ఇక ఈ డబ్బు మొత్తం టిడిపి లోని ఓ కీలక యువనేత కు చెందిన ఇంధన తయారీ కంపెనీ లోకి చేరిందన్నది అనుమానం.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బు చెల్లింపు వ్యవహారంలో కూడా సీఎం రమేష్‌ పాత్ర ఉన్నట్లు ఐటీ సోదాలలో తెలియ వచ్చింది. వైకాపా నుంచి టీడీపీ కి ఫిరాయించిన ఎమ్మెల్యే లకు ముట్టజెప్పిన సొమ్ములో కొంత డబ్బు సీఎం రమేష్‌ కంపెనీల ద్వారా చేరవేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అంతా పకడ్బందీగా ఆధారాలు దొరికిన వెంటనే సీఎం రమేష్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.