Home రాజకీయాలు సొమ్ము హెరిటేజ్ ఉద్యోగులది, దానం నారా ప్యామిలీది!

సొమ్ము హెరిటేజ్ ఉద్యోగులది, దానం నారా ప్యామిలీది!

SHARE

శ్రీకాకుళం జిల్లా తీవ్రమైన తుఫానుతో తల్లడిల్లుతూ ఉంటే… .అంతా సాయం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపులు ఇస్తూ ఉన్నాడు. మంత్రిగా ఆయన ఈ పిలుపును ఇస్తున్న నేపథ్యంలో ఈ పిలుపుకు ఆయన కుటుంబం ఏం స్పందించింది? అనే అంశం చర్చలో నిలిచింది. ఊరికే పిలుపులు ఎవరైనా ఇస్తారు..తమ వంతుగా ఏమైనా ఇస్తే అప్పుడు ఇచ్చే పిలుపుకు విలువ ఉంటుందనే పంచ్ లు పడ్డాయి. అవతల జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం కోసం తన వంతుగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు.

అయితే లోకేష్ మాత్రం తమ పార్టీ తరఫు నుంచి రూపాయి కూడా విదల్చలేదు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకూ ఏదో ఇచ్చామని అనిపించుకోవడానికి నారా ఫ్యామిలీ ప్రయత్నం చేస్తోంది. నారా బ్రహ్మణి శ్రీకాకుళం వరకూ వెళ్లి చంద్రబాబుకు అరవై ఆరు లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించింది. దీనికైతే అభినందించాల్సిందే.

అయితే ఈ సొమ్ములు ఎవరివి? అంటే.. హెరిటేజ్ ఉద్యోగుల ఖాతా నుంచి తీసినవి అని తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రహ్మణి స్వయంగా ప్రకటించింది. అంటే హెరిటేజ్ స్టోర్లలో ఐదువేలకూ, పది వేలకు పని చేసే సాధారణ ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు తీసుకుని.. వారి జీతాల్లో కోత విధించి ఆ సొమ్మును శ్రీకాకుళానికి ఇచ్చారన మాట.

ఇదీ నారా కుటుంబం మార్కు దానం. అవతల బ్రహ్మణి కోట్ల రూపాయల జీతం తీసుకుంటోంది. నారా భువనేశ్వరి అంతకు రెట్టింపు స్థాయిలో జీతం తీసుకుంటోంది. అయితే తమ వ్యక్తిగత సొమ్మును వీళ్లు దానం ఇవ్వలేదు. హెరిటేజ్ ఉద్యోగుల జీతాల్లో కోత వేసి డబ్బును తీసుకుని.. దాన్ని తమ పేరుతో దానం ఇస్తోంది. ఇదీ.. నారా ఫ్యామిలీ నీతి.