Home రాజకీయాలు ఐటీ దాడులు.. సీఎం రమేశ్ అవకతవకల విలువ ఎంత?

ఐటీ దాడులు.. సీఎం రమేశ్ అవకతవకల విలువ ఎంత?

SHARE

ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటి పై జరిగిన ఐటీ దాడుల్లో అధికారులు గుర్తించిన అవకతవకల గురించి ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఆసక్తిదాయకమైన సమాచారాన్ని ఇచ్చింది. దాని ప్రకారం.. సీఎం రమేశ్ ఇళ్లపై జరిపిన ఐటీ దాడుల్లో వంద కోట్ల రూపాయల వరకూ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారట ఐటీ అధికారులు. ఈ మేరకు ఒక జాతీయ దిన పత్రిక పేర్కొనడం విశేషం.

రమేశ్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ 74 కోట్ల రూపాయల నిధులను అనుమానాస్పద కంపెనీలకు మళ్లించిందని ఆ పత్రిక పేర్కొంది. గుర్తించలేని లావాదేవీలివి అని పేర్కొందట ఐటీ శాఖ. ఈ మేరకు ఐటీ శాఖ నుంచి సమాచారం అందినట్టుగా ఆ పత్రిక పేర్కొంది.

ఈ నెల 12 వ తేదీన సీఎం రమేశ్ నివాసం పై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తన ఇంటి నుంచి వారు దేన్నీ తీసుకెళ్లలేదు అని.. చిన కాగితం ముక్క కూడా వాళ్లు తీసుకెళ్లలేదని రమేశ్ పేర్కొన్నాడు. అయితే.. వాస్తవం మాత్రం వేరే అని.. అధికారులు కీలక పత్రాలను jస్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

వంద కోట్ల రూపాయలకు విలువైన అనుమానాస్పద లావాదేవీలను అధికారులు గుర్తించారు అని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు, అసలు కథలు ఏమిటనేవి ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే జాతీయ మీడియా ఢిల్లీ నుంచి ఈ మేరకు సమాచారాన్ని ఇస్తోంది.