Home రాజకీయాలు తిత్లీ తుఫాన్.. చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

తిత్లీ తుఫాన్.. చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

SHARE

దేన్నైనా తన రాజకీయానికి, తన రాజకీయ ప్రచారానికి వాడుకోవడంలో చంద్రబాబు నాయుడుకు మించిన రాజకీయ నేత మరొకడు ఉండడు. అనుకూల మీడియాను అడ్డం పెట్టేసుకుని చంద్రబాబు నాయుడు చేసే రాజకీయం అలాగిలాగా ఉండదు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ విషయంలో కూడా బాబు ఇలాగే వ్యవహరిస్తూ ఉన్నాడు.

తిత్లీ తుఫాన్ మిగిల్చిన విషాదం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇంకా బయటకు రాకున్నా.. చంద్రబాబు నాయుడు మాత్రం తుఫాన్ బాధితులను ఆదుకునేశా అని కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు. బాబు చేసుకుంటున్న ప్రచారం అలాగిలాగా లేదు. సముద్రాన్నే శాసించినట్టుగా చెప్పుకొంటున్నాడు. మరీ ఈ స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు అస్సలు సిగ్గుపడకపోవడం విశేషమే.

ఇలాంటి విపత్తుల సమయంలో అసలు పని కన్నా ప్రచారానికే చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. బాధితుల స్వరాన్ని వినిపించనీయకుండా చేస్తాడు. అందుకు అనుకూల మీడియా బాబుకు చాలా సాయమే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తిత్లీ విషయంలో కూడా అదే సాగుతూ ఉంది.

ఇలా ప్రచార ఆర్బాటానికి తిత్లీని వాడేసుకుంటున్న చంద్రబాబు నాయుడు మరోవైపు.. కేంద్రంపై దాడికి కూడా దీన్నే అవకాశంగా మలుచుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని.. సహాయ కార్యక్రమాలకు అడ్డం పడుతోందనికొత్త ఆరోపణ చేస్తున్నాడు. ఈ మధ్య ఏ వ్యవహారంలో అయినా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రెచ్చిపోతూ ఉన్నాడు. పనిలో పనిగా.. తిత్లీని కూడా కేంద్రంపై విమర్శలకు వాడుకొంటున్నాడు. దటీజ్ నారా చంద్రబాబు నాయుడు.