Home రాజకీయాలు వైఎస్సార్సీపీతో జనసేన సీట్ల బేరం? జగన్ ఏమన్నాడు?

వైఎస్సార్సీపీతో జనసేన సీట్ల బేరం? జగన్ ఏమన్నాడు?

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు పొత్తు పెట్టుకోవాలి.. అని కొంతమంది కోరుకుంటున్న విషయం అయితే వాస్తవం. ప్రత్యేకించి పవన్ ను గట్టిగా అభిమానిస్తూ.. అదే సమయంలో జగన్ ను మరీ శత్రువుగా భావించకుండా, చంద్రబాబు మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న వాళ్లు జగన్, పవన్ లు చేతులు కలిపితే బావుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. అలాగే చంద్రబాబుతో ఇప్పుడు కేసీఆర్ సంబంధాలు కూడా బాగా దెబ్బ తినడంతో.. కేసీఆర్ వైపు నుంచి కూడా ఈ ప్రతిపాదన వస్తోందని.. జగన్, పవన్ లు ఒక్కటై బాబును గట్టి దెబ్బ కొట్టాలని కేసీఆర్ వంటి వారు కూడా ఆకాంక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అలాంటి వారి చొరవతో సీట్ల ఒప్పందంపై కొన్ని ప్రయత్నాలు జరిగాయని సమాచారం. ప్రత్యేకించి ఇలాంటి పొత్తులకు జగన్ అంత సిద్ధంగా లేడు. తాము సోలోగానే సత్తా చాటాతాము, చాటగలము అనేది జగన్ కు మొదటి నుంచి ఉన్న విశ్వాసం. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు, మోడీ, పవన్ లు కూటమిగా వచ్చినా జగన్ తగ్గలేదు.

మరోవైపు కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా జగన్ నే లక్ష్యంగా చేసుకున్నాయి. అంత మంది శత్రువులుగా నిలిచినా జగన్ టీడీపీ కూటమి కన్నా కేవలం ఐదున్నర లక్షల ఓట్ల వెనుక మాత్రమే నిలిచాడు. ఇలాంటి నేపథ్యంలో వచ్చేసారి వారంతా వేర్వేరుగా వస్తే.. జగన్ కు ఎదురుండదు. ఇలాంటి నేపథ్యంలో పొత్తులు అవసరం లేదనేది జగన్ భావనగా తెలుస్తోంది.

కానీ.. మధ్యవర్తులు మాత్రం వీళ్లను కలిపే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. తమకు 33 సీట్లు ఇస్తే పొత్తుకు ఓకే అని పవన్ అంటున్నాడట. అయితే మధ్యవర్తులే అన్ని సీట్లు కాదు కానీ.. ఇరవై సీట్లు పవన్ కు ఒప్పించి ఈ పొత్తును కుదర్చాలనే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ తీరు జగన్ కు ఏమంత నచ్చడం లేదని.. అందుకే పొత్తు పట్ల అంత ఆసక్తితో లేడని సమాచారం.