Home రాజకీయాలు బాబు సర్వేల్లో దానిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్?

బాబు సర్వేల్లో దానిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్?

SHARE

మొన్నటి వరకూ ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహంగా కనిపించాడు. తెలంగాణలో కాంగ్రెస్ తో ఇప్పటికే చేతులు కలిపేసిన చంద్రబాబు నాయుడు… ఏపీలో కూడా కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయిపోయాడు. అక్కడకూ ఈ విషయంలో కొంతమంది టీడీపీ నేతలే అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు అంటే తాము ఆత్మహత్యలు చేసేసుకుంటామని వాళ్లు హెచ్చరించేశారు. అయితే బాబు మాత్రం వాళ్లను అదరగొట్టాడు.

కాంగ్రెస్ తో ఏపీలో కూడా పొత్తు అని తేల్చేశాడు. అందులో భాగంగా డజను సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలని బాబు స్కెచ్ కూడా వేశాడు. అయితే.. ఈ అంశంపై బాబు చేయించుకున్న సర్వేల్లో మొత్తం వ్యవహారం తేడా కొట్టేసిందని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే ప్రయోజనం లేకపోగా.. తనను జనాలు మరింతగా ఛీ కొట్టే అవకాశం ఉందని బాబుకు రిపోర్టులు అందాయట. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపితే అది అవకాశం వాదంలో పతాక స్థాయి అవుతుంది. ఇప్పటికే దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు ఒక్కోసారి ఒక్కో పార్టీతో చేతులు కలుపుతూ వస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ సారి కాంగ్రెస్ తో చేతులుకలిపితే బాబు అవకాశవాదం సంపూర్ణం అవుతుంది.

ఏ పార్టీ వ్యతిరేకతే పునాదిగా తెలుగుదేశం ఏర్పడిందో అదే పార్టీతో చేతులు కలిపితే బాబును జనాలు మరింతగా ఛీ కొట్టే అవకాశం ఉంది. ఇదే అంశమే తేలిందట సర్వేల్లో కూడా. దీంతో.. చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డాడట. కాంగ్రెస్ తో చేతులు కలిపితే జనాలు తనను ఛీ కొడతారని సర్వేలు స్పష్టం చేస్తుండటంతో బాబు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎన్నికలు పూర్తిగా దగ్గర పడ్డ సమయంలో తేలుద్దాం అని అనుకుంటున్నాడని టాక్.