Home ప్రత్యేకం జగన్.. వెల్‌డన్, టీడీపీకి మనసు లేదా?

జగన్.. వెల్‌డన్, టీడీపీకి మనసు లేదా?

SHARE

మొన్న కేరళ వరదల అప్పుడు తన పార్టీ తరఫు నుంచి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అప్పట్లో ఏపీ నుంచి కేరళకు ప్రకటించిన విరాళాల్లో జగన్ మోహన్ రెడ్డిదే గరిష్టం. ఏపీలో డబ్బున్న వాళ్లు లేరా? స్టార్లు లేరా? అయినా జగన్ మాత్రం వారందరి కన్నా ఎక్కువ మొత్తాన్ని కేరళకు విరాళాన్ని ప్రకటించాడు.

కేవలం కేరళ కోసమే కాదు.. తాజాగా తిత్లీ తుఫానుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం జిల్లాకు కూడా జగన్ తనవంతు సాయాన్ని ప్రకటించాడు. తన పార్టీ తరఫు నుంచి కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించాడు జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇది కచ్చితంగా అభినందనీయమే.

తిత్లీ బాధితుల కోసం ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. కొంతమంది సినీ తారలు విరాళాన్ని ప్రకటించారు. వారికి అనేక రెట్ల ఎక్కువ మొత్తాన్ని జగన్ డొనేట్ చేశాడు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అధికార తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కానీ స్పందించలేదు. తిత్లీ బాధితుల కోసం టీడీపీ తరఫు నుంచి కానీ.. చంద్రబాబు కుటుంబం తరఫు నుంచి వ్యక్తిగతంగా కానీ రూపాయి కూడా విదల్చలేదు. కేరళకూ రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు శ్రీకాకుళానికి ఇవ్వలేదు. రెండు సార్లూ జగన్ మాత్రం ఒక్కోసారి కోటి రూపాయల మొత్తం విరాళంతో తన పెద్ద మనసును చాటుకున్నాడు. జగన్ ను అభినందించి తీరాలి అంతా.