Home రాజకీయాలు పవన్ సీఎం సీట్ డ్రీమ్స్.. కామెడీగా లేవూ?

పవన్ సీఎం సీట్ డ్రీమ్స్.. కామెడీగా లేవూ?

SHARE

ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది పవన్ కల్యాణ్ తీరు. ఒక కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించడంతో పాటు.. తను ముఖ్యమంత్రి అయిపోతానని కూడా అనేస్తున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాకా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటున్నాడు. మొన్నటి వరకూ ఇలా మాట్లాడకూడదని చెప్పింది కూడా పవన్ కల్యాణే. ప్రజలతో మమేకం అవుతూ తను సీఎం అయితే వారికి మేలు చేస్తానని జగన్ అంటే.. పవన్ దాన్ని తప్పు పట్టాడు. ముఖ్యమంత్రిని అయితే చేస్తా అని అనకూడదన్నాడు.

ఇప్పుడు తను మాత్రం.. సీఎం సీటు ఎక్కుతానని చెప్పుకుంటున్నాడు. అయితే పవన్ కల్యాణ్ సీట్ డ్రీమ్స్ మాత్రం కామెడీగా మారుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటి వరకూ జనసేనకు తాడూ బొంగరం లేదు. మొన్న చేరిన నాదెండ్ల మనోహర్ ను మినహాయిస్తే.. మరెవరూ కూడా కాస్త చెప్పుకోదగిన పదవిలో ఉండిన నేతలు కాదు. మనోహర్ ను కూడా జనాలు మరిచిపోయారు. అలాంటి మనోహర్ చేరడమే జనసేన స్థాయికి ఎక్కువైపోయింది.

తెనాలిలో రేపు మనోహర్ పోటీ చేస్తే నెగ్గుతాడనే నమ్మకాలు ఏమీ లేవు. ఇక పవన్ కల్యాణ్ తన పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. ఇప్పటి వరకూ ఏపీలో జనసేనకు ఎన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జిలు ఉన్నారో చెప్పడం కూడా కష్టం. సరిగా ఐదారు నియోజకవర్గాలకు అధికారికంగా ఇన్ చార్జిలైనా ఉన్నారో లేదో.

ఇక పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున తిరిగిన నియోజకవర్గాల సంఖ్య కూడా తక్కువే. అసలు తను ఎక్కడ పోటీ చేయాలో కూడా పవన్ కు తెలియదు. ముఖ్యమంత్రి అయిపోవడం అంటే అది సినిమాల్లో అయినంత ఈజీ అని పవన్ అనుకుంటుంటే అనుకొంటుండవచ్చు. అయితే ఈయన తన అన్న అనుభవాన్ని గుర్తుంచుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. చిరంజీవికి అన్ని వర్గాలూ సపోర్ట్ చేస్తేనే వచ్చింది 18 సీట్లు. ఇప్పుడు పవన్ కు అంత మద్దతు కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రినవుతా అని పవన్ అనడం మాత్రం కామెడీగా ఉంది.