Home రాజకీయాలు “వారసత్వ౦ గురించి పవన్ చెప్పాలి….”

“వారసత్వ౦ గురించి పవన్ చెప్పాలి….”

SHARE

రాజకీయ వారసత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న జన సేన కవాతు బహిరంగ సభ లో చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. పవన్ కి ఎన్నో ప్రశ్నలు సంధించారు.

మీడియాతో ఈ రోజు మాట్లాడుతూ జలీల్ సినిమాల్లో వారసత్వం లేదా అంటూ ప్రశ్నించారు. మరి, సినిమాల్లో వారసత్వ౦ వున్నప్పుడు రాజకీయాల్లో ఉండకూడదనటానికి కారణం ఏంటన్నారు. పవన్ కల్యాణ్ సినిమా ల్లోకి ఎలా వచ్చారసలు….మెగా కుటుంబంలో అంతమంది హీరోలు ఎలా అయ్యారంటూ పంచ్ వేశారు……మీరంతా హీరోలయింది వారసత్వంతో కాదా అని ప్రశ్నించారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్లే పవన్ కల్యాణ్ రాజకీయా ల్లోకి వచ్చారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు జలీల్ ఖాన్.

జనసేన కవాతులో పవన్ కల్యాణ్ పై పూల వర్షం కురవడాన్ని కూడా జలీల్ ఖాన్ ప్రశ్నించారు. తమది పేద పార్టీ అని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు ఆకాశం నుండి పూలు చల్లించుకునేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. పవన్ కేవలం బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కనీస౦ 18 సీట్లు అయినా వచ్చాయని, కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా రాదనీ జోస్యం చెప్పారు.