Home రాజకీయాలు బాబు, లోకేష్‌లపై పవన్ పవర్ పంచ్‌లు!

బాబు, లోకేష్‌లపై పవన్ పవర్ పంచ్‌లు!

SHARE

తమ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన కవాతులో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడిపై ఆయన తనయుడు లోకేష్ పై విరుచుకుపడ్డాడు. వీరిని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విరుచుకుపడ్డాడు పవన్ కల్యాణ్. గత కొన్నాళ్లుగా తెలుగుదేశం వాళ్లు తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తునే.. ఇదే సమయంలో బాబు, లోకేష్ లపై పవన్ ఘాటైన పంచ్‌లు వేశాడు.

లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని ప్రసంగించాడు పీకే. లోకేష్ కనీసం పంచాయతీ ఎన్నికల్లో నెగ్గలేదని.. అలాంటి వ్యక్తి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎలా అయ్యాడు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. ఈ విధంగా లోకేష్ చేతగాని వాడు అన్నట్టుగా మాట్లాడాడు పవన్ కల్యాణ్. ఈ ప్రశ్న తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టేదే. అయితే పవన్ కల్యాణ్ గతంలో లోకేష్ ను ఇలా విమర్శించలేదు. లోకేష్ మంత్రి పదవి తీసుకున్నప్పుడు పవన్ ఈ ప్రశ్న వేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ పాయింట్ ను పట్టుకుని విమర్శించాడు.

ఇక చంద్రబాబు నాయుడు మీదా పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డాడు. అవినీతి పాలన అంటూ చంద్రబాబు మీద విమర్శలు చేశాడు. జన్మభూమి కమిటీలు రౌడీ కమిటీలు అని పవన్ ధ్వజమెత్తాడు. ఇక ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కొన్నాడు అని పవన్ కల్యాణ్ అన్నాడు. జనసేన ఎప్పుడూ టీడీపీ పల్లకి మోస్తూ ఉండాలా? అని పవన్ ప్రశ్నించాడు.

తన పార్టీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదన్నాడు. చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు నేను పని చేయాలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. తను బీజేపీని గట్టిగా విమర్శించాను అని అన్నాడు. ఈ సారి పవన్ కల్యాణ్ జగన్ మీద రొటీన్ గా వారసత్వం అంటూ విమర్శించాడు. అయితే చంద్రబాబు, లోకేష్ లను మాత్రం గట్టిగానే తగులుకున్నాడు.