Home రాజకీయాలు కానిస్టేబుల్ కొడుకా? చిరంజీవి తమ్ముడా?

కానిస్టేబుల్ కొడుకా? చిరంజీవి తమ్ముడా?

SHARE

పవన్ కల్యాణ్ రాజకీయాలు బాగానే వంటబట్టించుకొంటున్నట్టుగా ఉన్నాడు. ఈ మధ్య తరచూ కొత్త పాట పాడుతున్నాడు. తను కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకొంటున్నాడు. తాజాగా పవన్ తన పార్టీ కవాతు కార్యక్రమంలో కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఒక కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? అని ప్రశ్నించాడు.

పవన్ కల్యాణ్ తనను తాను కానిస్టేబుల్ కొడుకు అని చెప్పుకోవడానికి మించిన అవకాశవాదం మరోటి లేదు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ నిజంగానే కానిస్టేబుల్ కొడుకు అయ్యుంటే.. ఏ హోం గార్డు పనో చేసుకోవాల్సి వచ్చేది. ఇక్కడ తను చిరంజీవి తమ్ముడిని అనే విషయాన్ని దాచేస్తున్నాడు పీకే.

చిరంజీవి తమ్ముడు కాకపోయుంటే.. పవన్ కల్యాణ్ కు ఈ గుర్తింపు ఏదీ దక్కేది కాదనేది సత్యం. సినిమా హీరోగా అయినా.. మరో రకంగా అయిన పవన్ కల్యాణ్ ఒక అనామకుడు. చిరంజీవి తమ్ముడు కావడంతోనే సినీ అవకాశాలు వచ్చాయి. చిరంజీవి ఏర్పరుచుకున్న అభిమానగణం కొంత, కులంతో ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ కొంత పవన్ కల్యాణ్ ను స్టార్ ను చేసింది.

ఆ స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇలా రాజకీయ నేత వేషం వేశాడు పవన్ కల్యాణ్. ఇవన్నీ నిష్టూరసత్యాలే. అయితే రాజకీయంగా లబ్ధి పొందేందుకు పవన్ కల్యాణ్ ఇప్పుడు తనొక కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకుంటున్నాడు. ఒకవేళ కానిస్టేబుల్ కొడుకు మాత్రమే అయ్యుంటే పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీల్లో గుంపులో డ్యాన్సులు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవకాశవాదం కొద్దీ అన్న ద్వారా తనకు వచ్చిన సినీ వారసత్వాన్ని కూడా పక్కన పెట్టేసి పవన్ కల్యాణ్.. రాజకీయం చేస్తున్నాడు.