Home రాజకీయాలు లోకేష్ ఎంత త్యాగం చేశాడో చూశారా!

లోకేష్ ఎంత త్యాగం చేశాడో చూశారా!

SHARE

తిత్లీ తుఫాన్ నేపథ్యంలో నారా లోకేష్ బాబు పెద్ద త్యాగమే చేశాడట. అదేమంటే.. ఆయన తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నాడట. ఇదీ కథ. ఉత్తరాంధ్ర ప్రాంతం తిత్లీ తుఫానుతో అతలా కుతలం అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడి తనయుడి త్యాగం గురించి అనుకూల మీడియా ఏకరువు పెడుతోంది. చంద్రబాబు నాయుడు చాలా బాధ్యతతో నడుచుకొంటూ ఉన్నాడని, అందుకే తిత్లీ తుఫాను నేపథ్యంలో విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నాడని గొప్పగా చెబుతోంది పచ్చ మీడియా.

ఈ మధ్యనే చైనా నుంచి వచ్చాడు చినబాబు. ఇంతలోనే అమెరికా పర్యటన పెట్టుకున్నాడట. అక్కడకు వెళ్లి విపరీతంగా పెట్టుబడులు ఆకర్షించేద్దాం అనుకున్నాడట. అయితే ఇంతలో తుఫాన్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసేసింది. దీంతో లోకేష్ స్పందించేశాడట. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పర్యటన వద్దని అనుకున్నాడట. విదేశీ పర్యటనను రద్దు చేసుకుని త్యాగం చేసేశాడట. ఇలా చినబాబు చాలా బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నాడని పచ్చమీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

తిత్లీ తుఫానును అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు చాలా ప్రచారాన్నే పొందుతూ ఉన్నాడు. ఇప్పటికే ఈ విషయంపై విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన ప్రచారం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. తనే తుఫాన్ బాధితులందరినీ రక్షించేస్తున్నా అన్నట్టుగా బాబు ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే చంద్రబాబు అక్కడ మకాం పెట్టడం వల్ల అదనపు భారం తప్ప మరో ప్రయోజనం లేదని తెలుస్తోంది.

అయితే బాబు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. మోకాళ్ల లోతు నీళ్లలో బోట్ తో దిగి అనుకూల మీడియాలో ఆ ఫొటోలను వేసుకుని ప్రచారాన్ని పొందుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవతల లోకేష్ విదేశీ పర్యటనను రద్దు చేసుకుని పెద్ద త్యాగం చేసేస్తున్నాడు!