Home ప్రత్యేకం తండ్రిని ముప్పుతిప్పలు పెడుతున్న లోకేష్!

తండ్రిని ముప్పుతిప్పలు పెడుతున్న లోకేష్!

SHARE

దొడ్డి దారిన అయినా తనకు మంత్రి పదవి ఇచ్చేంత వరకూ తండ్రిని తిప్పలు పెట్టాడట లోకేష్. వెనుకటికి ఇలా మంత్రి పదవులు తీసుకోవడాన్ని చేతగాని తనం అనే వాడు చంద్రబాబు నాయుడు. అయితే.. అదే తనయుడి విషయానిక వచ్చేసరి ఆ చేతగాని తనానికే పట్టం గట్టాడు. తనయుడికి మంత్రి పదవిని ఇచ్చుకున్నాడు. ప్రజల నుంచి ఎన్నిక కాకపోయినా ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు.

ఇలా తనయుడిని చేతగాని వాడు అని చంద్రబాబు నాయుడు నిరూపించాడు. అందుకు తగ్గట్టుగా లోకేష్ తన చేవ ఏమిటో చాటుకుంటూనే ఉన్నాడు. తన మాట తీరుతో లోకేష్ నవ్వుల పాలవుతూనే ఉన్నాడు. ఈ కామెడీ ఆగడం లేదు. ఇది కొనసాగుతూనే ఉంది. ఇదంతా డైలీ సీరియల్ లాంటిది. లోకేష్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఎలా నవ్వుల పాలవుతాడో ఎవరికీ తెలియదు. అదలా సాగుతూ ఉంటుంది.

ఆ సంగతలా ఉంటే..ఇప్పుడు లోకేష్ ప్రత్యక్ష పోటీకి సిద్ధం అవుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయకపోతే నవ్వులపాలవుతానని లోకేష్ కు అర్థమైంది. అందుకే చాన్నాళ్లుగా సీటుకు సంబంధించిన కసరత్తు సాగుతూ ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే వివిధ సీట్లకు టీడీపీ తరఫున సరైన అభ్యర్థులు లేరు. అలాంటి చోట పార్టీ తరఫున లోకేష్ బాధ్యతలు తీసుకోవచ్చు. అయితే లోకేష్ కు అంత సీన్ లేదని స్పష్టం అవుతోంది.

చివరకు కుప్పం సీటునే ఖరారు చేయించుకుంటున్నాడట చంద్రబాబు నాయుడు తనయుడు. ఇప్పుడు ఈ సీటు నుంచి బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కుప్పం సీటును ఖాళీ చేసి తనయుడికి ఇవ్వనున్నాడట చంద్రబాబు. దీని కోసమని తను తిరుపతికి తరలి వెళ్లడానికి బాబు సిద్ధం అయ్యాడని సమాచారం. మరి చంద్రబాబుకు కుప్పం ఆవల గెలిచిన చరిత్రలు ఏమీ లేవు. ఇలాంటి నేపథ్యంలో ఆయన తిరుపతికి వెళ్లడం అంటే మాటేలేమీ కాదు. పెద్ద సాహసం చేస్తున్నట్టే లెక్క. అయితే తనయుడి కోసం చంద్రబాబుకు ఈ తిప్పలు తప్పడం లేదు.