Home సినిమా మీటూ లో నెక్స్ట్ వికెట్ సింగర్ కార్తీక్

మీటూ లో నెక్స్ట్ వికెట్ సింగర్ కార్తీక్

SHARE

మీటూ ఉద్యమం ప్రకంపనల జోరు తగ్గేలా లేదు. సెలబ్రిటీలు వారి తెర వెనుక బాగోతాల జాతర ఒక్కొక్కటిగా వెలుగు చూడటం తెలిసిందే. ఊహించని మనుషుల పేర్లు బయటకురావడం సామాన్య ప్రజలకి ఇండస్ట్రీ వ్యక్తులకే కూడా పెద్ద షాకే. టాలీవుడ్ద, కోలీవుడ్ లో #మీటూ ఉద్యమాన్ని తార స్థాయికి తీసుకెళ్లిన గాయని చిన్మయి తాజా ట్వీట్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ బండారాన్ని బయట పెట్టింది.

సింగర్ కార్తీక్ తనతో అసభ్యకరంగా వేధించారంటూ పేరు వెల్లడించని మహిళ బయటపెట్టింది.. జర్నలిస్టు‌ సంధ్య మేనన్‌ కు ఆమె తన మెసేజ్‌ పంపారు. సంధ్యా దాన్ని ట్విటర్‌ వేదిక గా షేర్‌ చేశారు. చిన్మయి శ్రీపాద తన మద్దతు తెలిపారు.

ఆ మెసేజ్ ఇలా వుంది: ‘హాయ్‌ సంధ్య.. నేను సింగర్‌ కార్తీక్‌ గురించి మాట్లాడాలి. అతను చాలా టాలెంటెడ్ సింగర్…అదే అతని ఆటిట్యూడ్ పాడుచేసివుంటుంది… ఎం చేసిన తనకి చెల్లుతుంది అనే భావంలోకి అతడిని పాడుచేసింది ….కొన్నేళ్ల కిందట నేను, కార్తీక్ ఓ పబ్లిక్‌ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాం. అక్కడ కార్తీక్‌ నా బాడీ గురించి చాలా చావకబారుగా మాట్లాడారు….నన్ను ముట్టుకోవాలని, అనుభవించాలని వుంది అంటూ కార్తీక్ అసభ్యంగా మాట్లాడాడు. నన్ను ఊహించుకుంటూ హస్తప్రయోగం చేసుకున్నానని కూడా అన్నాడు. కార్తీక్ మాటలు నన్ను షాక్‌కు గురిచేశాయి. ఆరోజు నేను ఏ మాత్రం సౌకర్యంగా ఉండలేకపోయా. అతడ౦టే అసహ్యం వేసింది…!

కార్తీక్‌ను కలవాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ అతడికి దగ్గరగా నిల్చోవాలంటే భయపడేదాన్ని పలువురు గాయనీమణులు కూడా కార్తీక్‌తో వేధింపులు ఎదుర్కొన్నట్లు విన్నానని కూడా మెసేజ్ లో తెలిపారు. ఇండస్ట్రీలో అతడు పేరున్న గాయకుడు. పెద్దల అండ కూడా ఉంది. అందుకే భయపడి అతడిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ బయటకిరాలేదు అంటూ బాధిత మహిళ తెలిపారు….కార్తీక్ ఓ సైకో. టూర్స్‌కు వెళ్లినప్పుడు మహిళా సింగర్స్‌ను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు దిగుతాడు.‌ అతడికి ఏమాత్రం సిగ్గులేదు’ అంటూ ఆ మహిళ జర్నలిస్టు సంధ్యకు మెసేజ్ పంపారు. ఈ విషయంలో తన పేరు బయటకి రాకుండా ఉండటమే మంచిదని భావిస్తు్న్నట్లు వెల్లడించారు.

సదరు మహిళకు చిన్మయి శ్రీపాద మద్దతు తెలుపుతూ.. కార్తీక్.. నీ టైమ్ ముగిసిపోయింది అని ట్వీట్ చేశారు!